Home » సూపర్ స్టార్ కృష్ణ కి స్థలం అమ్మి అప్పులు తీర్చిన చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ కి స్థలం అమ్మి అప్పులు తీర్చిన చిరంజీవి

by Anji
Published: Last Updated on
Ad

సీని ఇండస్ట్రీలో విజయాలు పరాజయాలు సర్వసాధారణమే. కేవలం సినీ రంగం మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో ఇదే సూత్రం వర్తిస్తుంది. కొంత మంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అద్భుతంగా ఉన్నప్పుడు ఆస్తులను పోగేసిన ఆ తరువాత కెరీర్ డౌన్ ఫాల్ అయితే అంతే వేగంగా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి. చాలా వరకు సీనియర్ హీరోయిన్లు ఆర్థిక క్రమశిక్షణ లేక తమ చివరి రోజుల్లో డబ్బు లేక ఇబ్బంది పడినవారు కూడా ఉన్నారు. అయితే హీరోలలో అలాంటివి చాలా తక్కువ. అయితే కొన్ని అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు వారికి సంబంధించిన ఆస్తులను అమ్మి అప్పులను తీర్చిన సందర్భాలు దాదాపు అందరి హీరోల జీవితాల్లోనూ చూసాం అలాంటి ఘటన మెగాస్టార్ చిరంజీవి జీవితంలోనూ ఉంది. ఏదో తొలినాళ్ళలో అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే. అది కూడా ఆయన మెగాస్టార్ గా తెలుగు సినిమా సింహాసనం మీద కూర్చున్న తరువాత నే అది జరిగింది.

Advertisement

చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండటం వల్ల తొలుత స్టూడియోలు అన్నీ అక్కడే ఉండేవి. అలా చాలామంది తెలుగు నటులు కూడా అక్కడే ఆస్తులను చేసుకుని కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉండిపోగా మరి కొంత మంది హైదరాబాద్ వచ్చేశారు. అలా సూపర్ స్టార్ కృష్ణ గారు అరుణాచలం గార్డెన్స్ పక్కన చెన్నైలో ఒక ఐదు ఎకరాల స్థలం తీసుకుని కృష్ణ గార్డెన్స్ గా నామకరణం చేసి షూటింగ్ లకు పనికి వచ్చేలా డెవలప్ చేశారు. ఆ గార్డెన్స్ లో వచ్చిన మొదటి సినిమా ఈనాడు. ఈ సినిమా కోసం మురికివాడకు సంబంధించిన సెట్స్ వేశారు. ఇక ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల షూటింగ్స్ కూడా కృష్ణ గార్డెన్స్ లో జరిగేవి. ఇక అందులో ఒక ఎకరా చిరంజీవి గారు ఎప్పుడో కొనుగోలు చేశారు.

Advertisement

Also Read :  మహేష్ “ఒక్కడు”లో ధర్మవరపు చెప్పిన “98480329*9” నెంబర్ ఎవరిదంటే..?

ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి విలీనం చేసేసారు. ఇదంతా తెలిసిన కథ అయితే ఆ సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారట. చిరు అందుకోసం అప్పు చేశారట. అప్పు తీర్చడానికి చెన్నై కృష్ణ గార్డెన్స్ లోని ఎకరా స్థలం అమ్మేశారట. దాంతో వచ్చిన రూ . 25 కోట్ల డబ్బులను అప్పులు తీర్చారట. ఇక ఈ విషయాన్ని చిరంజీవి గారికి అతి సన్నిహితుడైన ఎన్ వీ ప్రసాద్ గాడ్ ఫాదర్ ఈవెంట్ లో చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారంటూ చెప్పారు. ఇక కృష్ణ గార్డెన్స్ లోని 4 ఎకరాల్లో పద్మాలయ వారు డెవలప్మెంట్ కు ఇచ్చేశారు. ప్రస్తుతం అక్కడ అరుణాచలం స్టూడియో కూడా లేదు. ఇక కృష్ణ గార్డెన్స్ కూడా అపార్ట్మెంట్ తో ఉంది.

Also Read :  ఎన్టీఆర్ తో సినిమా అంటే భయం వేసింది అంటున్న ప్రియదర్శి..!

Visitors Are Also Reading