Home » టాలీవుడ్ పై మెగాస్టార్ అసంతృప్తి….ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి..?

టాలీవుడ్ పై మెగాస్టార్ అసంతృప్తి….ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో డైరెక్టర్లు వర్క్ షాప్స్ నిర్వహించాలని సూచించారు. అలా చేయడంవల్ల నటించడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందని సినిమా బాగా వస్తుందని చెప్పారు.

chiranjeevi

chiranjeevi

కొంతమంది డైరెక్టర్లు సెట్స్ లో డైలాగులు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా డైలాగ్ రాస్తే ఏం డైలాగ్ వస్తుందో అన్న ఆందోళన ఉంటుందని దాంతో నటనపై దృష్టి పెట్టలేక పోతామని తెలిపారు. అంతేకాకుండా స్క్రిప్ట్ వచ్చేలోపు టిఫిన్ కూడా తినాలనిపించదని అన్నారు. ఇక కొంతమంది కేవలం హీరోలకు మాత్రమే స్క్రిప్ట్ ను వివరిస్తారని కానీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి టెక్నీషియన్లకు నటీనటులకు హీరోలకు ప్రతి ఒక్కరికి స్క్రిప్ట్ మరియు డైలాగులను వివరించాలని తెలిపారు.

Advertisement

Advertisement

chiranjeevi

chiranjeevi

సినిమా ప్రారంభానికి మూడు నెలల ముందే వర్క్ షాప్స్ నిర్వహిస్తే మేలు జరుగుతుందని చెప్పారు. అమీర్ ఖాన్ తన ప్రతి సినిమాకు ముందు వర్క్ షాప్స్ నిర్వహిస్తాడని అన్నాడు. మూడు నెలల ముందే సినిమా కథ అందులోని డైలాగ్స్ ను పూర్తిగా నేర్చుకుంటాడని చెప్పారు.

మిగతా నటీ నటులకు కూడా స్క్రిప్టు ఇవ్వడం వల్ల వారు డైలాగులు నేర్చుకుని టెన్షన్ లేకుండా నటిస్తారని అన్నారు. టాలీవుడ్ లో రాజమౌళి సినిమాకు ముందు వర్క్ షాప్స్ నిర్వహిస్తారని చెప్పారు. సినిమా ప్రారంభించినప్పటి నుండి రాజమౌళి అదే లోకంలో ఉంటారని అన్నారు. ప్రతి నటుడి పై దృష్టి పెడతారని చెప్పారు.

Visitors Are Also Reading