Home » బ్లాక్ బస్టర్ పడటం తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన చిరు…ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే..?

బ్లాక్ బస్టర్ పడటం తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన చిరు…ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి భారీ అంచనాల నడుమ రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమా తో చిరు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన మెగాస్టార్ సినిమాలన్నీ కూడా మెగాస్టార్ సత్తా చూపించలేకపోయాయి.

Advertisement

అయితే చిరు ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపించింది. నిర్మాతల కు ఈ సినిమా తో భారీ లాభాలు వచ్చాయి. అయితే ఫ్లాప్ లు పడినపుడు చిరంజీవి రెమ్యునరేషన్ పెద్దగా డిమాండ్ చేయలేదు.

Advertisement

మెగాస్టార్ అంటే క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేదు. ఇక వాల్తేరు వీరయ్య తో పాత చిరంజీవి మళ్లీ తెరపైన కనిపించాడు. దాంతో చిరు కూడా ఇప్పుడు రెమ్యునరేషన్ ను భారీగా పెంచినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఇది వరకు 20 నుండి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న చిరంజీవి ఇప్పుడు దాన్ని డబుల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఒక్క సినిమాకు రూ. 50 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading