మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ అనేది ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. సైరా నరసింహారెడ్డి వల్ల నిర్మాతలకు నష్టాలూ రాగా.. తాజాగా విడుదల అయిన ఆచార్య సినిమా గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే విషయం తెలిసిందే.
Advertisement
చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించడంతో దీని పైన భారీ అంచనాలు అనేవి వచ్చాయి. దాంతో డిస్టిబ్యూటర్లు కూడా భారీ మొత్తానికి సినిమాను కొన్నారు. కానీ వారికీ భారీ మొత్తంలో నష్టాలూ అనేవి వచ్చాయి. అందుకే ఆ ఆచార్య దెబ్బకు ఇప్పుడు ఆయన నుండి రాబోతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్ విషయంలో ఓ కోలక నిర్ణయం అనేది చిరంజీవి తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
అదేంటంటే.. సినిమా విడుదలకు ముందు ఈ సినిమాను డిస్టిబ్యూటర్లకు మొత్తం డబ్బుకు అమ్మకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేవలం సినిమా రేట్ యూ ఫిక్స్ చేసుకొని.. అడ్వాన్స్ మాత్రం తీసుకొని సినిమాను విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడట. అలా చేయడం వల్ల సినిమా ప్లాప్ అయితే డిస్టిబ్యూటర్లకు పెద్దగా నష్టం అనేది కలగకుండా.. హీరోగా తాను అలాగే నిర్మాతలు సెటిల్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాడట చిరు.
Advertisement
ఇవి కూడా చదవండి :