చిరంజీవి హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో 2001లో రిలీజైన చిత్రం మృగరాజు. ఈసినిమాకు దేవీ వర ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లోనే 15 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. ఘోస్ట్ అండ్ ది డార్క్ నెస్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ఈ సినిమాను తీశారు.
సినిమా కోసం సింహం:
ఈ సినిమాలో కీలక పాత్ర సింహానిది, సింహాం చిరుల మధ్య ఫైట్ సినిమాకే హైలెట్. అందుకే సింహాన్ని గ్రాఫిక్స్ లో కానివ్వకుండా రియల్ సింహాన్ని తీసుకొచ్చారు. అప్పటికే 100కు పైగా హాలీవుడ్ సినిమాల్లో నటించిన బాస్వెల్ సర్కస్ కంపెనికి చెందిన జాక్ అనే సింహాన్ని దక్షిణాఫ్రికా నుండి స్పెషల్ గా తెప్పించారు.
Advertisement
Also Read: అప్జనిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి.. ప్రస్తుతం ఊబర్ క్యాబ్ డ్రైవర్..!
Advertisement
సింహానికి పారితోషికంగా 67లక్షలు:
7 అడుగుల పొడువు, 4.5 అడుగుల ఎత్తున్న జాక్ కు రోజుకు 10వేల డాలర్లు ఇచ్చి తెచ్చుకున్నారు. మొత్తం 26 రోజుల పాటు సింహం సీన్లను తీసి సర్కర్ కంపెనీ వారికి జాక్ పారితోషికం కింద దాదాపు 67 లక్షలు ముట్టజెప్పారు. ఈ సింహం రాత్రివేళ మాత్రమే బయటికి వచ్చేది కాబట్టి దానికి తగ్గట్టే సీన్లను ప్లాన్ చేసుకున్నాడు గుణశేఖర్.
ఈ సినిమాలోని సింహం ఎపిసోడ్ల షూటింగ్ కోసం చిరంజీవి దాదాపు రోజుకు 20 గంటలు సెట్ లోనే గడిపాడట! సింహం మూడ్ ను అనుసరించి సినిమా పూర్తిచేసేసరికి ఈ చిత్ర టీమ్ తల ప్రాణం తోకకొచ్చిందట!
Also Read: రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిస్తే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఎమ్మెల్యే