Home » సీఎం జగన్ వద్దకు సింగిల్ గా మెగాస్టార్….ఈ అంశాలపైనే చర్చ…!

సీఎం జగన్ వద్దకు సింగిల్ గా మెగాస్టార్….ఈ అంశాలపైనే చర్చ…!

by AJAY
Ad

ఏపీలో టికెట్ ధరల ఇష్ష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్లతో రెండుసార్లు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఏపీ మంత్రి పేర్నినానితో టికెట్ ధరల పై నియంత్రణ విధిస్తే సినిమా పరిశ్రమకు వచ్చే నష్టాల గురించి పూర్తిగా వివరించారు. కానీ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల నియంత్రణ పై వెనక్కి తగ్గలేదు. ఈ విషయంపై పరిశ్రమ నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు.

Chiranjeevi

Advertisement

హీరో నాగార్జున రీసెంట్ గా బంగార్రాజు సినిమా ఈవెంట్ లో ప్రస్తుతం ఉన్న ధరలతో తమ సినిమాకు ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. టికెట్ ధరల పై నియంత్రణ ఉంచడం సినిమా పరిశ్రమకు నష్టమేనని అన్నారు. దీనిపై అందరూ ముందుకు రావాల్సి ఉందని అన్నారు. ఇక నటుడు మోహన్ బాబు ఈ విషయంపై ఓ లేఖను విడుదల చేశారు.

Advertisement

తెలంగాణలో మరీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఏపీలో టికెట్ల ధరలపై పరిమితులు ఉన్నాయని రెండు కూడా నష్టమేనని అన్నారు. సినిమా పరిశ్రమ అంటే కేవలం నలుగురు వ్యక్తులు కాదని వేల కుటుంబాలు ఉన్నాయని అందరితో చర్చలు జరిపి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లాలని అన్నారు. టికెట్ల అంశంపై చర్చించేందుకు అందరు ముందుకు రావాలని కోరారు. అయితే ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర విషయం ఏంటంటే నేడు మెగాస్టార్ చిరంజీవి సినిమా టికెట్ల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల విషయంపై సీఎం జగన్ తో చర్చించనున్నారు.

Also read : మల్టీప్లెక్స్ తో పాటూ మరో బిజినెస్ లోకి అల్లు అర్జున్…బ్రాండ్ పేరు ఏంటంటే..?

టికెట్ల ధరలపై నియంత్రణ విధిస్తే సినిమా పరిశ్రమకు వచ్చే నష్టాన్ని మెగాస్టార్ సీఎంకు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. సినిమా టికెట్ల వివాదం రోజురోజుకు ముదురుతున్న కారణంగానే చిరంజీవి జగన్ తో భేటీ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి చిరంజీవితో చర్చల అనంతరం అయినా ఏపీ సర్కార్ వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Visitors Are Also Reading