Home » ప్రాణాలను పణంగా పెట్టి ఆ పాటలో డాన్స్ చేసిన చిరంజీవి… అలా చేయడానికి ప్రధాన కారణం అదే..!

ప్రాణాలను పణంగా పెట్టి ఆ పాటలో డాన్స్ చేసిన చిరంజీవి… అలా చేయడానికి ప్రధాన కారణం అదే..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి డెడికేషన్… టైం సెన్స్ ఉంది కాబట్టే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. చిరంజీవి డెడికేషన్ గురించి… టైం సెన్స్ గురించి ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు అనేక సందర్భాలలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ విషయంలో కూడా చిరంజీవి డెడికేషన్ అద్భుతమైన రీతిలో పని చేసిందట… అది ఏమిటో తెలుసుకుందాం.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీలలో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి. ఈ సినిమాలో శ్రీదేవి… చిరంజీవి సరసన హీరోయిన్గా నటించగా… దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. 1990వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా భారీ కలక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసులు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించాడు.

Advertisement

ఈ మూవీ పాటలు కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించాయి. ఈ సినిమాలోని ఒక పాట కోసం చిరంజీవి తన ప్రాణాలనే పణంగా పెట్టి డాన్స్ చేశాడట. ఈ మూవీలోని “దినక్కుతా” అనే సాంగ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ సాంగ్ లో చిరంజీవి ఏ రేంజ్ లో స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించాడో కూడా మనకు తెలిసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలోనే ఈ సాంగ్ ను ఈ సినిమా చివరి వర్కింగ్ డే రోజు షూట్ చేశారట. ఈరోజు తర్వాత శ్రీదేవి వేరే సినిమా షూటింగ్ లో పాల్గొనవలసి ఉందట… అప్పటికే సినిమా విడుదల తేదీని కూడా మూవీ బృందం అనౌన్స్ చేసిందట.

కాకపోతే చిరంజీవికి ఆ సమయంలో 104 డిగ్రీల తీవ్రమైన జ్వరం ఉందట… కాకపోతే సినిమా విడుదల తేదీని ప్రకటించడం… శ్రీదేవికి కూడా వేరే సినిమా పనులు ఉండడంతో అంతటి జ్వరంతో ప్రాణాలను ఫణంగా పేట్టి… పక్కన డాక్టర్లను పెట్టుకొని చిరంజీవి ఈ పాటకు డాన్స్ చేశాడట. అంతటి జ్వరంలో కూడా చిరంజీవి ఈ పాటలో శ్రీదేవి ని బీట్ చేసే రేంజ్ లో డాన్స్ చేశాడు. ఇలా చిరంజీవి తన డేడికేషన్ ను ఈ సాంగ్ ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు.

Visitors Are Also Reading