Telugu News » Blog » చిరంజీవి సినిమా విడుదలపై క్లారిటీ..!

చిరంజీవి సినిమా విడుదలపై క్లారిటీ..!

by Manohar Reddy Mano
Ads

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో చేస్తున్నాడు అనేది అందరికి తెలిసిందే. ఇక అందులో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా గాడ్ ఫాథర్. మలయాళంలో లూసిఫర్ గా మోహన్ లాల్ చేసిన సినిమాను చిరంజీవి తెలుగులో ఈ గాడ్ ఫాదర్ పేరుతో చేస్తున్నారు. అయితే ఈ సినిమా అనేది షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసుకుంది. కానీ దీని విడుదల పైన అందరికి అనుమానాలు అనేవి ఉన్నాయి.

Ads

అయితే ఈ సినిమా అనేది దసరా కానుకగా విడుదల అవుతుంది అని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ప్రమోషన్స్ మాత్రం చిత్ర యూనిట్ ప్రారంభించలేదు. అందుకే ఈ సినిమా అనేది మళ్ళీ వాయిదా పడుతుంది అని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ పైన క్లారిటీ అనేది వచ్చేసింది. గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

Ads

ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం తన కెరియర్ లో 154వ సినిమాగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్.. మరో రెండు రోజులో ఈ షూటింగ్ ను ముగించుకోనున్నారు అని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత నుండి వరుసగా ఈ గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ పైనే చిరంజీవి ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా అనేది హిట్ అవుతుందా.. లేక ఆచార్యలా డిజాస్టర్ అవుతుందా అనేది.

Ad

ఇవి కూడా చదవండి :

గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!

మొదటి బంతి పడకుండానే 9 రన్స్ ఇచ్చిన లంక..!