Telugu News » శరవేగంగా మెగాస్టార్ “గాడ్ ఫాదర్” షూటింగ్…రిలీజ్ ఎప్పుడంటే…?

శరవేగంగా మెగాస్టార్ “గాడ్ ఫాదర్” షూటింగ్…రిలీజ్ ఎప్పుడంటే…?

by AJAY MADDIBOINA

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరు గ్యాప్ లేకుండా కొత్త దర్శకులు… సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ ఆచార్య సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉండగానే చిరంజీవి మళయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Ads

లూసిఫర్ సినిమా తెలుగులో కూడా విడుదల చేశారు. అయినప్పటికీ చిరంజీవికి కథ నచ్చడంతో ఆయన మళ్లీ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సఘభాగం వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో అనసూయ, సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా తమిళ, మలయాళ నటీ నటులు సైతం ఈ చిత్రం లో భాగమయ్యారు.

 

మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవిని ఢీకొట్టే పాత్రలో తమిళ హీరో మాధవన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి చిత్రయూనిట్ సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దాంతో ఆచార్య విడుదలైన కొద్దిరోజుల్లోనే గాడ్ ఫాదర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరగకుండా ఉండి అంతా అనుకున్నట్టు జరిగితే గాడ్ ఫాదర్ ను సమ్మర్ లో చూడవచ్చు.


You may also like