Home » ఆచార్య ప్లాప్ అని బాధ పడుతున్న “చిరు ఫాన్స్” అందరికి రాసిన ఆ లెటర్ ! ఆయన చెప్పింది నిజమేకదా ?

ఆచార్య ప్లాప్ అని బాధ పడుతున్న “చిరు ఫాన్స్” అందరికి రాసిన ఆ లెటర్ ! ఆయన చెప్పింది నిజమేకదా ?

by AJAY

మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఘోరమైన నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా చాలా తక్కువ వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మెగా అభిమానులు తీవ్రమైన నిరాశ చెందుతున్నారు.

దాంతో ఓ మెగా ఫ్యాన్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన మెగా అభిమానుల‌కు ధైర్యం చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆచార్య సినిమా రిజల్ట్ తో మెగా అభిమానులు నిరాశ చెందార‌ని గమనించి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించిన లెజెండ్ చిరంజీవి అని ఎవరూ మర్చిపోవద్దు.

అమితాబ్ బచ్చన్ ను ఓడించి ఆపద్బాంధవుడు సినిమాకు భారతదేశంలోనే రూ.1.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి.

1987లో అకాడమీ అవార్డులకు ఆహ్వానించబడిన మొదటి సౌత్ ఇండియన్ స్టార్ హీరో కూడా చిరంజీవి గారే.

ఇండియాలో ఏడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరో కూడా చిరంజీవి. ఇంద్ర సినిమా కోసం చిరంజీవి 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ త‌ర‌వాత అమీర్ ఖాన్ 6కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడు.

చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.10కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టిన మొద‌టి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లు రాబట్టిన మొదటి తెలుగు సినిమా కూడా చిరంజీవి న‌టించిన ఇంద్ర సినిమా. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేఉసింది.

టాలీవుడ్ ఉత్తమ నటుడిగా అత్యధికంగా 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక హీరో చిరంజీవి.

చిరంజీవి హీరోగా నటించిన 47 సినిమాలు ఏపీ, తెలంగాణలో 100 రోజులు ఆడాయి. టాలీవుడ్ లోనే ఇదో అరుదైన రికార్డు.

పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ, ఆటకి యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ మరియు ఇంద్ర లాంటి 8 ఇండస్ట్రీ హిట్ల‌ను కైవసం చేసుకున్న ఒకే ఒక్క హీరో చిరంజీవి.

మేమంతా చిరంజీవి సినిమాలు చూస్తూ పెద్దవాళ్ళం అయ్యాం. మ‌న‌కు మెగాస్టార్ సినిమాల‌లో కావలసినంత వినోదం… ఆనందం లభిస్తాయి. సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే హీరో ఆయన ఒక్కడే. చిరంజీవి కులాన్ని రాజకీయ పార్టీని చూసి ఆయన అభిమానులు గా మారలేదు. చిరంజీవి డాన్స్ లు నటన చూసి ఆయ‌న న‌ట‌న చూసి ఆయన్ని ప్రేమించాను. అందరికీ ఆదర్శమైన చిరంజీవి కృషి పట్టుదల తో ఎదిగారు. తొమ్మిదేళ్లుగా ఎలాంటి సినిమాలు చేయకుండా మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు చిరంజీవి రీఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి సినిమాలు ఇంటర్వ్యూలు మ‌న‌లో టెన్షన్స్…. రొటీన్ జీవితానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. అపజయాలను ఎలా ఎదుర్కోవాలో చిరంజీవి మనకు ఎప్పుడో చూపించారు.

మృగరాజు, బిగ్ బాస్ సినిమాల తర్వాత ఆయన నిరాశ చెంది ఉంటే ఇంద్ర, ఠాగూర్ లాంటి సూపర్ హిట్ లు వచ్చేవి కాదు. చిరంజీవికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళు చిరంజీవి పతనాన్ని చూసి ఆనందిస్తారు. ఆచార్య ఫ్లాప్ ను కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో జనాలు ఆనందిస్తున్నారు. చిరంజీవి జీవితంలో ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అన్నిటికీ మెగాస్టార్ సమాధానం చెబుతారు. అంటూ అభిమాని లేఖలో పేర్కొన్నారు. ఇక మెగాస్టార్ అభిమానులంతా ఇది నిజమే కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also read :

మహేష్ బాబు నోట సీఎం జగన్ ఫేవరెట్ డైలాగ్….దాని వెనక అసలు కారణం అదేనా…!

మాన‌వ‌త్వం చాటిన పోలీసులు.. మోటార్ సైకిల్ కొనుగోలు..!

Visitors Are Also Reading