Ad
నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉండే పోటీ గురించి సినిమా అభిమానులకు అందరికి తెలిసిందే. ఈ ఇద్దరి టాప్ హీరోల సినిమాలు అనేవి ఎన్నో సార్లు పోటీ అనేవి పడ్డాయి. ముఖ్యంగా వీరి సినిమాలు పోటీ పడేది సంక్రాంతికి. అయితే వచ్చే ఏడాది 2023 సంక్రాంతికి కూడా మళ్ళీ బాలయ్య, చిరు థియేటర్లలో పోటీ పడబోతున్నారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న వీరసింహారెడ్డి సినిమా అలాగే.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా రెండు సంక్రాంతికే విడుదల కానున్నాయి అనేది తెలిసిందే. అయితే ఈ సినిమాలకు వేరు వేరు డైరెక్టర్లు ఉన్న నిర్మాతలు మాత్రం ఒక్కరే. ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు వీరి పోటీ వల్ల మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు నష్టం అనేది వస్తుంది అని తెలుస్తుంది. ఎలా అంటే.. ఈ రెండు సినిమాలు ఒక్కే రోజు విడుదల కానుండటంతో.. ఈ సినిమాకు బయ్యర్లు తక్కువ రేట్ అనేది ఇస్తున్నట్లు తెలుస్తుంది. అదే ఈ రెండు సినిమాలు వేరు వేరు రోజులో వస్తే మాత్రం ఎక్కువ ఇస్తాం అని చెబుతున్నారట. కానీ బాలయ్య, చిరు ఇద్దరు వెన్నకి తగ్గేలా లేరు. అందువల్ల మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు దాదాపుగా ఇప్పుడే 30 కోట్ల నష్టం అనేది వస్తుంది అని సమాచారం.
ఇవి కూడా చదవండి :
చెన్నైని విడుతు కొత్త జట్టులోకి జడేజా ఎంట్రీ..?
ఎన్ని రన్స్ చేసిన కోహ్లీ గొప్ప ఆటగాడు కాదు..!
Advertisement