Home » పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.. అందుకోసమేనా ?

పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.. అందుకోసమేనా ?

by Anji
Ad

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడ్డారట. అయినప్పటికీ క్రమక్రమంగా వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకొని ఇవాళ తిరుగులేని స్టార్ హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి కేవలం తన స్వప్రయోజనమే చూసుకోకుండా తన తమ్ముళ్లు అయినా నాగబాబు, పవన్ కళ్యాణ్ లను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఎంతగానో ప్రోత్సహించాడు. 

Advertisement

వీరి ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికీ చాలా ముచ్చటగానే ఉంటుంది. అయితే ఆ మధ్య నాగబాబు ఓ సినిమా తీసి ఉన్న ఆస్తులను పోగొట్టుకోవడంతో.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఆర్థికంగా సహాయం చేసి సినిమా ఇండస్ట్రీలో నెలబెట్టారు. ప్రస్తుతం నాగబాబు సినిమాలతో పాటు పలు రకాల ఈవెంట్ లు, షోలలో రాణిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. వరుస సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఓ రౌడీతో జరిగిన గొడవ గురించి యూట్యూబ్ లో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులో నివాసముండేవాడు. దీంతో అప్పుడప్పుడు కొందరూ దర్శక, నిర్మాతలు సినిమా షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరిపే వారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కోడి రామకృష్ణ కూడా చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కోడంబాకం ఏరియాలో సినిమా షూటింగ్ చేశారు.  

Advertisement

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవిని కొందరూ లోకల్ గుండాలు వచ్చి ఆట పట్టించారు. వీటిని మెగాస్టార్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ చిరంజీవి కారు డ్రైవర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరోసారి ఇలా చేయకూడదని.. అలాగే షూటింగ్ స్పాట్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడట. అయినా ఆ గుండాలు మాట వినకపోవడంతో పవన్ కళ్యాణ్ గొడవ పడి బాగానే బుద్ధి చెప్పాడట. ఈ గుండాల గ్యాంగ్ లీడర్ కి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు.  ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆసుపత్రి వద్దకు వెళ్లి గ్యాంగ్ లీడర్ కుక్కు స్వామిని పరామర్శించాడు. ఇలా చేసినందుకు పవన్ కళ్యాణ్ ని మందలించాడట చిరంజీవి. ఇలాంటి గొడవలకు మరోసారి దూరంగా ఉండాలని మాట కూడా తీసుకున్నాడట చిరంజీవి.  పవన్ కళ్యాణ్ కూడా హాస్పిటల్ కి వెళ్లి కుక్కు స్వామిని పరామర్శించాడట.  అదేవిధంగా సారీ చెప్పడంతో పాటు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారట. చిన్నప్పటినుంచి అయినా సరే తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడట పవన్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రూ.కోటికి భర్తను అమ్మిన భార్య.. ‘శుభలగ్నం’ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

 భారీ పారితోషకం ఇస్తామన్న చిరంజీవితో నటించేందుకు వాణి శ్రీ ఒప్పుకోలేదు.. ఎందుకో తెలుసా ? 

Visitors Are Also Reading