Home » అంజి సినిమా ప్లాప్ కు కారణాలేంటి.. ఎన్ని కోట్ల నష్టం వచ్చింది..?

అంజి సినిమా ప్లాప్ కు కారణాలేంటి.. ఎన్ని కోట్ల నష్టం వచ్చింది..?

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే టాలీవుడ్ లో 150కి పైగా సినిమాలను తీశారు. అందులో చాలా సినిమాలు హిట్ కాగా మరికొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయితే.. మరికొన్ని సినిమాలు ఎన్నో అంచనాలు మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యాయి. అలాంటి మెగాస్టార్ సినిమాల్లో అంజి సినిమా కూడా ఒక్కటి. 2004 లో విడుదల ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో పెద్ద ప్లాప్ సినిమా అనే చెప్పాలి . అయితే ఇందులో చిరు కి జంటగా నమ్రత నటించింది. ఇక కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

అయితే ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. మొత్తం 7 సంవత్సరాలు ఈ సినిమాను తెరకేకించారు. అప్పుడు వచ్చిన సినిమాలో దీనిలో ఉపయోగించినంత గ్రాఫిక్స్ అనేది మారె సినిమాలోనూ వడలేదు. ఈ గ్రాఫిక్స్ కారణంగానే ఈ సినిమా అనేది చాలా ఆలస్యం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ను తీసేందుకు రెండు ఏళ్ళు పటింది. ఎందుకంటే ఈ అంజి క్లైమాక్స్ మొత్తం గ్రాఫిక్స్ నిండి ఉంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎన్నో సమస్యలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఇందులో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించినవారు సినిమా పూర్తయే సమయానికి పెద్దవారు అయ్యేపోయారు.

Advertisement

అయితే ఇన్ని ఏళ్ళు కష్టపడి మొత్తం 25 కోట్లు ఖర్చు చేసి సినిమా తీశారు. కానీ విడుదల అయిన తర్వాత మాత్రం రిజల్ట్ అనేది మీరెలా వచ్చింది. జనాలు ఈ సినిమాలు అంతగా ఆదరించలేదు. ముఖ్యంగా రెండేళ్లు తీసిన ఈసినిమా క్లైమాక్స్ జనాలకు నచ్చలేదు. అందుకే 25 కోట్లు ఖర్చు చేసిన ఈ సినిమా అనేది 5 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. దాంతో నిర్మాతకు చాలా నష్టం వచ్చింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు బాగానే హైప్ ఉన్నా కూడా.. విడుదల ఏడేళ్లు పట్టడంతో ప్రజలకు ఆ సినిమా పై ఆసక్తి అనేది పోయింది. అందుకే ఈ సినిమా ప్లాప్ అయ్యింది అని అంటున్నారు విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ జట్టు మారిన అంబటి రాయుడు..!

మరోసారి విరాట్ వైఫల్యం… రోహిత్ క్లారిటీ..!

Visitors Are Also Reading