Home » మెగాస్టార్ చిరంజీవి పెళ్లి పత్రిక చూశారా.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే..!!

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి పత్రిక చూశారా.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టెక్కుతూ ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయస్సు దాటిన ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పెండ్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జీవితంలో పెళ్లి రోజు అనేది మర్చిపోలేని ఘట్టం.

Advertisement

also read:కాంతా రావు కొడుకులకి ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారకులు ఎవరు ? ఆయన వల్లే ఇలా ?

1980 ఫిబ్రవరి 20వ తేదీన మద్రాసులో ఉదయం 10:50 నిమిషాలకు చిరంజీవికి మరియు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో పెళ్లి జరిగింది. అదేరోజు ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య రిసెప్షన్ కూడా జరిగిందట. అలాంటి చిరంజీవి వివాహం జరిగి ఇప్పటికి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయన వైవాహిక జీవితంలో ఎన్నో మధుర స్మృతులు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయట. ఈ విధంగా సురేఖతో వివాహం తర్వాత చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Advertisement

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్నారు. చివరికి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ పొలిటీషియన్ గా మారారు. సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, సక్సెస్ కాకపోవడంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి మంత్రిగా కొన్నాళ్లు సేవలందించి, చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పెళ్లికి పత్రికకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి ఆ పెళ్లి పత్రిక ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కెయండి.

also read:

Visitors Are Also Reading