Home » చిరంజీవితో తలపడనున్న బోయపాటి… అదే జరుగుతే ఈసారి మామూలుగా ఉండదు..!

చిరంజీవితో తలపడనున్న బోయపాటి… అదే జరుగుతే ఈసారి మామూలుగా ఉండదు..!

by AJAY
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించాడు. తాజాగా చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయాన్ని అందుకుంది.

Advertisement

ఈ మూవీలో చిరంజీవి తన అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. బాబి కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా… మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా వాల్టేరు వీరయ్య సినిమాతో పవర్ఫుల్ మాస్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

మిల్క్ బ్యూటీ తమన్నా ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా… కీర్తి సురేష్ ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను… రామ్ పోతినేని ఒక మూవీ తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ఈ మూవీ బృందం ప్రకటించింది.

కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని అనుకున్న తేదీ కంటే రెండు నెలల ముందుగానే అనగా ఆగస్టు నెలలోనే విడుదల చేయడానికి ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదే నెలలో చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ కూడా విడుదల కావడంతో ఈ రెండు మూవీల మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరగనున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading