సింగర్ చిన్మయి శ్రీపాద… పేరు తెలియని వారు ఉండరు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి.. బాగానే పోరాటం చేసింది ఈ సింగర్. అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే తాజాగా చిన్మయి మరోసారి హాట్ కామెంట్ చేసింది. అమ్మాయిలకు పేరెంట్స్ స్వేచ్ఛ ఇవ్వడం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది చిన్మయి.
Advertisement
Advertisement
“తమ కూతురుకు గౌరవంగా జీవించే అవకాశం అసలు ఇవ్వరు. తన కాళ్ళ మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వరు ఎందుకు అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. కట్నం ఇచ్చి మరి పెళ్లి చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా మరియు స్వతంత్రంగా బతకనివ్వరు”” అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.
అందుకే ఫోర్స్ చేసి… వెధవ అయినా పర్లేదు సొంత క్యాస్ట్ లో వారిని పెళ్లి చేసుకోవాలి. తర్వాత కొట్టినా తిట్టినా వాడితోనే కాపురం చేయాలని రాసుకొచ్చింది ఈ అమ్మడు. ఈ స్టోరీస్ చూసి కొంతమంది అమ్మాయిలు అయినా సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది నాకు చాలు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.