Home » వరస్ట్ జాబ్ అంటూ ప్రధాని పై సింగర్ చిన్మయి ఫైర్…!

వరస్ట్ జాబ్ అంటూ ప్రధాని పై సింగర్ చిన్మయి ఫైర్…!

by AJAY
Published: Last Updated on
Ad

చిన్మ‌యి శ్రీపాద చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. సింగ‌ర్ గా డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మ‌యి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప‌లువురు స్టార్ హీరోయిన్ ల‌కు చిన్మ‌యి డబ్బింగ్ చెప్పింది. ఇక టాలీవుడ్ హీరో రాహుల్ ను చిన్మ‌యి ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ న‌ట‌న‌తో పాటూ ద‌ర్శ‌క‌త్వం కూడా చేస్తున్నారు.

Advertisement

ఇక చిన్మ‌యి సింగర్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా కంటే మీటూ తో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచి హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం పై స్పందిస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండ‌గా చిన్మ‌యి సోష‌ల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఆస్క్ మీ అంటూ ప్ర‌శ్న‌లు వేయాల‌న ఫాలోవ‌ర్స్ ను కోరింది.

Advertisement

దాంతో ఫాలోవ‌ర్స్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అయితే అందులో ఓ అభిమాని మిమ్మ‌ల్ని ప్రధాన‌మంత్రిగా చూడాలంటూ కామెంట్ పెట్టింది. మీలాంటి మ‌హిళ ప్ర‌ధాని కావాలంటూ కామెంట్ లో పేర్కొంది. దానికి చిన్మ‌యి న‌వ్వుతూ స‌మాధానం ఇస్తూ…ప్ర‌ధాని అవ్వ‌డం అంత సులువు అనుకుంటున్నారా….పైగా ప్ర‌పంచంలోనే అది వ‌రెస్ట్..ట‌ఫెస్ట్ జాబ్ అంటూ వ్యాఖ్యానించింది.

Visitors Are Also Reading