Home » కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్

కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్

by Anji
Ad

ఛతీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ కొరడా దెబ్బలు తిన్నారు. మీరు వింటున్నది నిజమే అండి. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ఆలయంలో పూజలు చేసి కొరడా దెబ్బలు తిన్నారు. చతీస్ గడ్ లో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. దీపావళి మరుసటి రోజు మంగళవారం దుర్గ్ జల్లాలోని జజంగిరి గ్రామంలో జరిగిన గోవర్ధన్ పూజలో భూపేష్ బాగేల్ పాల్గొన్నారు గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ప్రార్థించారు.

Advertisement

గోవర్ధన్ పూజలో భాగంగా జాజంగిరి గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పండుగ రోజున గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని విఘ్నాలు తొలగిపోయి శుభం కలుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం.అంతేకాదు.. పూజ అనంతరం మాంసాహారాన్ని సైతం ఆరగిస్తారు వారి నమ్మకం ప్రకారం సీఎం భూపేష్ బాగేల్ వేట అక్కడికి చేరుకొని పూజలు నిర్వహించి కొరడా దెబ్బలు తింటారు గోవర్ధన్ పూజలో పాల్గొని సీఎం కొరడా దెబ్బలు తిన్నారు.

Advertisement

ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ జాజంగిరి గ్రామంలోని గౌరా గౌరీ చేరుకున్న అనంతరం ఆలయానికి చెందిన వీరేందర్ ఠాకూర్ అనే వ్యక్తి సీఎం చేతి పై ఐదు కొరడా దెబ్బలు కొట్టారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది ముఖ్యమంత్రి ఈ గౌరా గౌరీ పూజలో పాల్గొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. జాజమ్ గిరికి చేరుకున్న ముఖ్యమంత్రి బాగెల్ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

Also Read :  ఆరు పదుల వయసులో 16 ఏళ్ళ పిల్లలా సుహాసిని అందం..ఫొటోస్ అదిరిపోలా..!!

Visitors Are Also Reading