Home » శ్రీ‌వారికి చెన్నై భ‌క్తులు రూ.9.20 కోట్లు విరాళం

శ్రీ‌వారికి చెన్నై భ‌క్తులు రూ.9.20 కోట్లు విరాళం

by Anji
Ad

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో కొలువై ఉన్న శ్రీ‌వేంక‌టేశ్వ‌రునికి నిత్యం విరాళాలు అంద‌జేసే విష‌యం తెలిసిన‌దే. అయితే  చెన్నైలోని మైలాపూర్‌కు చెందిన రేవంతి విశ్వ‌నాథ్ భారీగా విరాళం అంద‌జేసింది. మ‌ర‌ణించిన త‌న సోద‌రి డాక్ట‌ర్ పార్వ‌తి జ్ఞాప‌కార్థం సోద‌రికి సంబంధించిన ఆస్తిని టీటీడీకి విరాళంగా అంద‌జేసింది. మొత్తం విరాళంలో రూ.3.20 కోట్లు న‌గ‌దు, రెండు ఇండ్ల విలువ రూ.6కోట్లు, టీటీడీకి విరాళంగా అంద‌జేశారు. తిరుమ‌ల ఆల‌యంలో ఉన్న‌టువంటి రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఉన్న వైవీ సుబ్బారెడ్డికి రేవ‌తి విశ్వ‌నాథ్ ఈ మొత్తం విరాళాన్ని అందించారు.

Also Read :  19th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Advertisement

అందులో రూ.3.20 కోట్లు పిల్ల‌ల ఆసుప‌త్రికి, రూ.కోట్ల ఆస్తిని చైర్మ‌న్‌కు అప్ప‌గించారు. ఇదిలా ఉండ‌గా.. టీటీడీ ఉద‌య అస్త‌మ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి విరాళాలు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ల విక్ర‌యం ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని తిరుమ‌ల విరాళాల విండోను అందుబాటులోకి తెచ్చింది. టికెట్ల విక్ర‌యం ద్వారా వ‌చ్చిన మొత్తంను తిరుమ‌ల‌లోని పిల్ల‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి వినియోగించ‌నున్నారు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా విరాళాలు ఇవ్వాల‌ని టీటీడీ ప్ర‌జ‌లకు సూచించిన‌ది.

Advertisement

మ‌రొక‌వైపు శ్రీ‌వారి అర్జిత సేవ‌లు పున‌రుద్ధ‌రించాల‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొవిడ్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డంతో అర్జిత సేవ‌ల‌ను స‌డ‌లించింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం, శ్రీ‌ఘ్ర‌ద‌ర్శ‌నం, టికెట్ల సంఖ్య క్ర‌మంగా పెంచాల‌ని నిర్ణ‌యించింది. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికిఇ రూ.3,096.40 కోట్ల అంచ‌నాల‌తో రూపొందించిన టీటీడీ బ‌డ్జెట్‌ను ఆమోదించింది. అందులో ముఖ్యంగా రూ.230 కోట్ల‌తో శ్రీ‌ప‌ద్మావ‌తి చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం. త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్ భూమి పూజ చేయ‌నున్నారు. రెండేండ్ల కాలంలో నిర్మాణం పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు.

Also Read :  టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 6 గురు!

Visitors Are Also Reading