కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి షాకిస్తూ చెన్నై కోర్టు నోటీసులు పంపింది. చూస్తుంటే ఆయనను ఆ విమానాశ్రయం ఘటన వదిలేలా కన్పించడం లేదు. ముహూర్తాన బెంగుళూరు విమానాశ్రయంలో పెట్టాడో గానీ ఆ ఘటన మాత్రం ఆయనను పట్టుకుని శనిలా వేధిస్తోంది. తాజాగా మహా గాంధీ చేసిన ఫిర్యాదు మేరకు విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్‌లకు చెన్నైలోని సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది.
Advertisement
Advertisement
సమాచారం ప్రకారం విమానాశ్రయంలో నటుడి బృందం తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ మహా గాంధీ చేసిన ఫిర్యాదు మేరకు విజయ్ ను విచారణకు పిలిచారు. నవంబర్ 2 న సేతుపతి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత ఢిల్లీ నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా, అతని బృందం, మహా గాంధీ మధ్య ఘర్షణ జరిగింది. వాస్తవానికి విమానాశ్రయంలో నటుడిపై గాంధీ దాడికి ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. వాగ్వాదం తర్వాత విమానాశ్రయం వెలుపల విజయ్ మేనేజర్ తనపై దాడి చేశాడని మహా గాంధీ చెన్నై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్‌తో పాటు అతని మేనేజర్‌కి నోటీసులు పంపిన కోర్టు.. జనవరి 2న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఇక ఈ వివాదంపై అప్పట్లో స్పందించిన సేతుపతి ఇది చిన్న విషయమని కొట్టిపారేశారు. అంతే కాకుండా ఈ విషయాన్నీ మీడియా పెద్దది చేయాల్సిన అవసరం లేదంటూ ఆయన మండి పడ్డారు.