ప్రపంచ వ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే.. తాజాగా హిమాలయాలలో కరోనాకు చెక్ పెట్టే మొక్కలు ఉన్నాయని ఐఐటీ మండి, ఐసీజీఎంబీలు గుర్తించాయి. హిమాలయాలలో పెరిగే ఈ మొక్కలు రోడో డెండ్రాన్ ఆర్బోరియం అనే మొక్కకు కరోనాను ఎదుర్కునే శక్తి ఉన్నదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement
రోడో డెండ్రాన్ ఆర్బోరియం మొక్కను స్థానికంగతా బురాన్ అని పిలుస్తారు. ఈ మొక్క పూరేకులన స్థానికులు అనేక ఆయయుర్వేద ఔషదాల్లో వినియోగిస్తారు. టీకాలు కాకుండా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇతర పద్దతులపై కూడా ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. మొక్కల నుంచి లభించే ఆయుర్వేద ఔషదాలు శరరీంలోని కణాల్లోకి ప్రవేశించి వైరస్‌ను అడ్డుకుంటాయి అని.. వైరస్‌ను అడ్డుకునేన శక్తిని శరీరానికి కల్పిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి హిమాలయాల్లో నివసించే స్థానికులు ఈ బురాన్ష్‌ను ఔషద మూలికలలో వినియోగిస్తున్నారు అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Advertisement