Home » హైదరాబాద్ కు విప్లవ దివిటి చేగువేరా కూతురు, మనవరాలు, ఎందుకొచ్చారంటే?

హైదరాబాద్ కు విప్లవ దివిటి చేగువేరా కూతురు, మనవరాలు, ఎందుకొచ్చారంటే?

by Bunty
Ad

విప్లవ యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఇస్తే సానియా గువేరా కూడా నగరానికి వస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతి లో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తే ఫానియా ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. ఈ సభలో బిజెపి, ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొననున్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబాకు చాలా దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

Advertisement

అందులో భాగంగా క్యూబాకు మద్దతు తెలుపుతూ హైదరాబాదులో నిర్వహించే సభకు చేగువేరా కూతురు, మనవరాలు వస్తున్నారు. వారికి నేతలు ఘనంగా స్వాగతం పలకనున్నారు. క్యూబా సంఘీభావ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని, తమ్మినేని, మాజీ ఎంపీ మల్లురవి, పలు పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొననున్నారు.

Advertisement

అటు సభ జరిగే రవీంద్ర భారతి వద్ద భారీగా ఫ్లెక్సీలు, కటౌట్ లు వెలిశాయి. చేగువేరా ఫ్లెక్సీలతో పాటు ఆయన కూతురు, మనవరాలని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, అమెరికా సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా క్యూబా దేశానికి చాలా దేశాలు మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగా క్యూబాకు మద్దతు తెలుపుతూ హైదరాబాదులో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

READ ALSO : Cristiano Ronaldo : రోనాల్డోకు కష్టాలు.. రూ. 4.5 లక్షలు ఇస్తానని చెప్పినా, వంట మనిషి దొరకడం లేదట

Visitors Are Also Reading