Telugu News » ఛ‌త్ర‌ప‌తి శంక‌ర్ కు రాజ‌మౌళి పిలిచి మ‌రీ అకాశాలు.. కార‌ణం ఏంటి…!

ఛ‌త్ర‌ప‌తి శంక‌ర్ కు రాజ‌మౌళి పిలిచి మ‌రీ అకాశాలు.. కార‌ణం ఏంటి…!

by AJAY MADDIBOINA

రాజ‌మౌళి సినిమాలో అవ‌కాశం అంటే అంత ఈజీ కాదు. ఒక‌ప్పుడే రాజమౌళి టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా మారిపోయారు. జ‌క్క‌న్న సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల అవుతున్నాయి. దాంతో రాజ‌మౌళి సినిమాల్లో నటిస్తే దేశ‌వ్యాప్తంగా గుర్తింపు వ‌స్తుంది. కాబ‌ట్టి బాలీవుడ్ న‌టీన‌టులు సైతం రాజ‌మౌళి సినిమాల్లో న‌టించాల‌ని ఆశ‌ప‌డుతున్నారు.

Ads

అలాంటిది రాజ‌మౌళి మాత్రం ఓ తెలుగు న‌టుడికి పిలిచి మ‌రీ అవ‌కాశాలు ఇస్తున్నాడు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. ఛ‌త్ర‌ప‌తి శంకర్….ఈ న‌టుడు ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఛ‌త్రప‌తి సినిమాలో హీరోకు ఫ్రెండ్ గా న‌టించాడు. విక్ర‌మార్కుడు సినిమాలో కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లో మ‌ల్లి తండ్రిగా న‌టించి ఆక‌ట్టుకున్నాడు.

కాగా తాజాగా ఛ‌త్ర‌ప‌తి శంక‌ర్ త‌న‌కు రాజ‌మౌళితో ఉన్న అనుబంధం గురించి బ‌య‌ట‌పెట్టాడు. రాజ‌మౌళిగారిని తాను ఎప్పుడూ అవ‌కాశాల కోసం అడ‌గ‌లేద‌ని అన్నారు. త‌న‌కు స‌పోర్ట్ చేయాల‌నే ఉద్దేశ్యంతోనే రాజ‌మౌళిగారు అవ‌కాశాలు ఇస్తున్నార‌ని చెప్పారు. రాజ‌మౌళి సీరియ‌ల్ చేస్తున్న స‌మ‌యం నుండే త‌న‌కు ప‌రిచ‌యం ఉందని చెప్పారు. అప్ప‌టి నుండి త‌న‌ను ప్రోత్స‌హిస్తూ ఉంటార‌ని చెప్పారు.

రాజ‌మౌళిని అవ‌కాశాల కోసం ఎప్పుడు అడ‌గ‌లేద‌ని..ఫోన్ చేయ‌డం మెసేజ్ చేయ‌డం లాంటివి కూడా చేయ‌న‌ని అన్నారు. ఆయ‌నే గుర్తుపెట్టుకుని మ‌రీ అవ‌కాశాలు ఇస్తుంటార‌ని చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ లో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇద్ద‌రూ గొప్ప‌గా న‌టించార‌ని తెలిపారు. అంతే కాకుండా చ‌ర‌ణ్ తో కలిసి న‌టించాన‌ని చిరంజీవితో క‌లిసి న‌టించే అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేద‌ని చెప్పారు. చిరంజీవిని క‌ల‌వాలనే కోరిక ఉంద‌ని శంక‌ర్ అన్నారు.


You may also like