Telugu News » Blog » “ఛత్రపతి” శేఖర్ భార్య మనకు బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్.. ఆమె ఎవరంటే..?

“ఛత్రపతి” శేఖర్ భార్య మనకు బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్.. ఆమె ఎవరంటే..?

by Bunty
Published: Last Updated on
Ads

Chatrapathi Shekar Wife: దర్శక ధీరుడు జక్కన్న సినిమాల్లో ఎక్కువగా కనిపించే నటుల్లో చంద్రశేఖర్ కూడా ఒకరు. ఆయన చేసే ఏ పాత్ర అయినా పూర్తి న్యాయం చేయగల సత్తా కలిగిన నటుడు. అందుకే రాజమౌళి తన సినిమాలో చంద్రశేఖర్ కు అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాగే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన చత్రపతి సినిమాలో భద్ర పాత్ర పోషించారు.

Advertisement

Also Read:   బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి అన్యాయం చేశారా..?

Chatrapathi Shekar Wife

Chatrapathi Shekar Wife

బాహుబలి సినిమాలో తప్ప రాజమౌళి అన్ని సినిమాల్లో చంద్రశేఖర్ నటించారు. రాజమౌళి మొదటి చిత్రమైన స్టూడెంట్ నెంబర్ వన్ అలాగే చంద్రశేఖర్ కూడా ఇదే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. చంద్రశేఖర్, రాజమౌళి సినిమాలే కాకుండా ఇంకా అనేక సినిమాల్లో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించారు. అలాంటి చంద్రశేఖర్ భార్య గురించి చాలామందికి తెలియదు. ఆయన భార్య పేరు భవాని. ఈమె కూడా సినిమాల్లో యాక్టర్ కావడం విశేషం.

Advertisement

Also Read: సావిత్రి ఇంట్లో ఉన్న బీరువాల కొద్దీ బంగారం… కూతురు విజయచాముండేశ్వరి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాకు చెందిన భవానీని సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కెరీర్ లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇద్దరు సినిమా అవకాశాల కోసం ట్రై చేశారు. ఈమె సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సాధించింది. పండగ చేసుకో, కిట్టు, జెంటిల్మెన్ వంటి చాలా సినిమాల్లో కూడా నటించింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వివిధ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ఈమె తెలుగుతో పాటుగా తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది.

Advertisement

ఇవి కూడా చదవండి :  హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా..?