అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా, సాక్షి వైద్య హీరోయిన్గా చేసింది. ఈ మూవీ కోసం అఖిల్ తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు.
read also : IPL 2023 : పవన్ కళ్యాణ్, CSK టీమ్ కు ఉన్న సంబంధమేంటి?
Advertisement
తనదైన శైలి యాక్షన్ స్టంట్లు చేశారు. అయినప్పటికీ సినిమా టాక్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది. అయితే అక్కినేని అఖిల్ కంటే ముందుగా ఈ సినిమా కథ ఓ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిందట. ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడట. మొదటిగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్ర కథను రాంచరణ్ దగ్గరకు తీసుకెళ్లారట.
Advertisement
READ ALSO : వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు
అయితే ఇతర కమిట్మెంట్స్ కారణంగా చరణ్ ఈ మూవీని సున్నితంగా తిరస్కరించాడట. ఈ విషయాన్ని అప్పట్లో రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం అఖిల్ కి ఈ కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించారు. కానీ విడుదలైన మొదటి ఆటకే ఈ చిత్రం ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. కాగా, ఏజెంట్ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
READ ALSO : ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో దుమ్ములేపింది !