తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన నటి సోనియా అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. ఈమె మొదటి సారి 2002లో నీ ప్రేమకై అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది. అంతకు ముందు బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది. కన్నడ సినిమాల్లో కూడా నటించింది. 2003లో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 7/G బృందావన కాలనీ సినిమాలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొంత కాలానికే సెల్వరాఘవన్‌ను ప్రేమించి 2006లో వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఈమె సినిమాలకు స్వస్తీ చెప్పింది. ఆ తరువాత వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో 2009లో వీరు విడిపోయారు. కొంత కాలం తరువాత మళ్లీ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. విడాకులు తీసుకున్న తరువాత ఈమె ఇంతవరకు మరో పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ తో కలిసి సోనియా అగర్వాల్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఇక ఎస్పీబీ చరణ్ విషయానికొస్తే.. సింగర్‌గా రాణిస్తున్నాడు. ఈయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడిగా సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాను ఏమిటో నిరూపించుకున్నారు చరణ్. ఈ మధ్య సింగర్ గా చరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.చరణ్ తండ్రి అడుగు జాడలోనే కేవలం సింగర్‌గానే కాకుండా నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా ఇలా బహుముఖ ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇతను తొలుత తమిళ, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకునిగా పని చేశారు. 2000 సంవత్సరంలో కన్నడ చిత్రం హుడుగిగాగి చిత్రం ద్వారా నటుడిగా మారాడు. 2008లో వచ్చిన సరోజా చిత్రంలో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
2007లో చెన్నై 600028 చిత్రంతో సహా పలు చిత్రాలను ఆయన నిర్మించారు. ఈ నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో ముఖ్యంగా చెన్నై600028 ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీనికి పలు అవార్డులు కూడా దక్కడం విశేషం. ఇక నటుడిగా కూడా అద్భుతంగా నటించారనే చెప్పాలి. కన్నడంలో పరిచయమైన చరణ్ ఆ తరువాత అన్ని తమిళ సినిమాల్లో నటించాడు. కొన్నింటిలో అతిథి పాత్రలో, కొన్నింటిలో పూర్తిస్థాయి నిడివి గల పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పాడుతా తీయగా సింగింగ్ షోకు జడ్జీగా కూడా వ్యవరిస్తున్నారు. ఈయన త్వరలోనే ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ 7/G బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నదనే విషయాన్ని ఎస్పీ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడం విశేషం.
Also Read :
వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?
సూర్య కూతురుకు టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!