Home » చ‌ర‌ణ్‌, చైత‌న్య‌, రామ్ సినిమాల‌తో చాలా న‌ష్ట‌పోయా.. ఆ డిస్ట్రిబ్యూట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

చ‌ర‌ణ్‌, చైత‌న్య‌, రామ్ సినిమాల‌తో చాలా న‌ష్ట‌పోయా.. ఆ డిస్ట్రిబ్యూట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీలో లాభాలు న‌ష్టాలు అనేవి కామ‌న్‌. కొన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెడితే.. మ‌రికొన్ని సినిమాలు చాలా న‌ష్టాల‌ను మూట‌క‌డుతాయి. ఇలా న‌ష్టాలు తెచ్చిన సినిమాల గురించి ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, నిర్మాత పీఎన్ రామ‌చంద్ర‌రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Advertisement

ముఖ్యంగా తాను మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ సినిమాతో డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ ప్రారంభించాన‌ని చెప్పుకొచ్చారు. కానీ త‌న‌ను డిస్ట్రిబ్యూట‌ర్ మాత్రం ఆ ముగ్గురి హీరోల సినిమాలు చాలా దెబ్బ‌తీసాయ‌ని వెల్ల‌డించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తుఫాన్ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. రూ.12కోట్లు పెట్టి హ‌క్కులు కొనుగోలు చేస్తే 7 కోట్ల రూపాయ‌లు ఔట్ అని ఆయ‌న కామెంట్ చేశారు. అదేవిధంగా అక్కినేని హీరో నాగ‌చైత‌న్య దోచేయ్ సినిమాకు డిస్ట్రిబ్యూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాను. ఆ సినిమా కూడా మ‌రొక దెబ్బ అనే చెప్పారు.

Advertisement


ఇక రామ్ హీరోగా న‌టించిన ఒంగోలు గిత్త సినిమాకు డిస్ట్రిబ్యూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాను. ఆ సినిమా త‌న కెరీర్‌పై చాలా ఎఫెక్ట్ చూపించింద‌ని తెలిపారు. న‌న్ను నిల‌బెట్టి నా వెనుక ఉన్న వ్య‌క్తుల‌కు సైతం ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ మూడు సినిమాలు దెబ్బ‌కొడితే సైలెంట్‌గా ఉండిపోయాన‌ని వెల్ల‌డించారు. తాను ఓ అనుభ‌వ‌జ్ఞునిగా సినిమాల డిస్ట్రిబ్యూష‌న్ కు దూరంగా ఉంటే చాలా బెట‌ర్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. నేను చేసిన ఈ ప‌నుల వ‌ల్ల నా కుటుంబం చాలా న‌ష్ట‌పోయింద‌ని తెలిపారు. ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు క‌ల‌ర‌ని.. థియేట‌ర్ ర‌న్ చేయ‌డం త‌ప్ప తాను అన్ని చేశాన‌ని వివ‌రించారు.


తాను 4, 5 జ‌న‌రేష‌న్ల‌ను చూశాన‌ని.. కామెంట్స్ చేశారు. దర్శ‌కునిగా లాంగ్ టైమ్ కెరీర్ కావాల‌ని వేర్వేరు త‌ర‌హా క‌థ‌ల‌ను తాను ఎంచుకున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ఇక మెరుపుదాడి సినిమాతో త‌న‌కు మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ ద‌క్కింద‌ని చెప్పుకొచ్చారు. నేను దాదాపు 16 మంది హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేశాన‌ని వెల్ల‌డించారు. స్టార్ హీరోల సినిమాల గురించి పీఎన్ రామ‌చంద్ర‌రావు చేసిన కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : 

ముంబై పేలుళ్లలో ఎందరో జవానులు చనిపోయిన సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ మాత్రమే ఎందుకు తీశారో తెలుసా ?

బ్రహ్మం గారి కాలజ్ఞానం మరో సారి నిజమైందా ? నేపాల్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసా ?

Visitors Are Also Reading