చాణక్యుడి గురించి నేటి తరానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరతరాలుగా ఆయన రచించిన అర్ధశాస్త్రంలోని మెళకువలను నేటికీ మనం నేర్చుకుంటున్నాం. కేవలం అర్ధ శాస్త్రం మాత్రమే కాదు బ్రతకడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా చాణుక్యుడు వివరించాడు.
Advertisement
చాణుక్యుడు చెప్పిన నీతి వాక్యాలన్నీ ప్రస్తుతం చాణక్య నీతి అన్న గ్రంధం ద్వారా నేటి తరానికి చేరుతున్నాయి. అయితే చాణుక్యుడు ప్రతి మనిషి తమ జీవితంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాడు. అవేంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. జీవితంలో ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే అందుకోసం ముందుగా చేయాల్సింది మంచి చెప్పే వారి విషయాలను వినడం. చాణుక్యుడు చెప్పినట్లు జీవితంలో పైకి రావాలంటే ఎటువంటి విషయాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఎల్లప్పుడూ నెగటివ్ గా మాట్లాడే స్త్రీలకూ, ఇతరులు నష్టపోయేలా మాట్లాడే మహిళలకు దూరంగా ఉండాలి. ఇలాంటి దుష్ట ఆలోచనలు కలిగిన మహిళలకు సాయం చేయడం కూడా హానికరమేనని గుర్తించాలి. ఎల్లప్పుడూ ఇతరులను విమర్శించేవాడిని, తన ఓటమిని దేవునిపై తోసి దేవుడిని నిందించేవాడిని దూరంగా ఉంచడమే మంచిది. ఇటువంటి వారితో సహవాసం మిమ్మల్ని పాజిటివ్ గా ఆలోచించనివ్వదు. మూర్ఖత్వం కలిగినవారిని దూరంగా ఉంచాలి. వీరితో వాదించడం తగదు. సమయం వృధా అవ్వడమే తప్ప వీరితో స్నేహం మిమ్మల్ని ముందుకెళ్లనివ్వదు. ఇతరుల విజయాన్ని చూసి ఈర్ష్య, అసూయ పొందేవారు, లాభాన్ని ఆశించేవారిని కూడా దూరంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే వీరు రేపు మీ విజయాన్ని చూసి కూడా ఈర్ష్య పడతారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పుష్ప 2 మూవీ గురించి ఈ వార్త వింటే.. మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే..!
ఈ నాలుగు చెట్ల నీడ మన ఇంటిపై అస్సలు పడకూడదు…!