హైదరాబాద్ మహా నగర ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ప్రయాణికులకు మెట్రో కీలక అలర్ట్ జారీ చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ ముగియడంతో మెట్రో రైలు వేళలు గురువారం నుంచి మారాయి. రాత్రి 12 గంటలు కాకుండా గతంలో నడిచినట్లే రాత్రి 11 గంటలకి చివరి ట్రిప్ రైళ్లు బయలుదేరుతాయి. టర్మినల్ స్టేషన్లయిన ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్ నుంచి చివరి మెట్రో రైళ్లు వెళ్తాయి. రాత్రి 12 గంటల వరకు గమ్యస్థానానికి చేరుకుంటాయి.
Advertisement
Advertisement
ఎగ్జిబిషన్ సందర్భంగా ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో అందించిన సేవలకు గాను నుమాయిష్ ముగింపు రోజు కియోలిస్ స్టేషన్స్ డీజీఎం జైపాల్ రెడ్డి ని మంత్రి మహమూద్ ఆలీ అభినందించారు. జ్ఞాపికను బహుకరించారు. కాగా, నాంపల్లిలో నుమాయిష్ సందర్భంగా, మెట్రో ట్రైన్ సేవలను మరో గంట పొడిగిస్తున్నట్లు గతంలో అధికారులు వెల్లడించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు అర్ధరాత్రి 12 గంటల దాకా మె ట్రో రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం మార్గాల్లో ఈ పెంచిన పనివేళలు అమ ల్లో ఉంటాయని చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నుమాయిష్ పరిధిలోని గాంధీభవన్ మెట్రో స్టేషన్ లో టికెట్ కౌంటర్లు పెంచారు. అయితే ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ 46 రోజులు ఎగ్జిబిషన్ కు వెళ్లేందుకు 11 లక్షల మంది ప్రయాణికులు మెట్రో వినియోగించుకున్నారని మెట్రో వర్గాలు తెలిపాయి.
READ ALSO : చిరంజీవి పై కోపంతో సినిమా సెట్ బయటే నిలబెట్టి మరి తిట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ అతడేనా ?