Chandramukhi 2 Review : చంద్రముఖి అనే పేరు వినగానే అందరూ భయపడతారు అన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు జ్యోతిక కాంబినేషన్లో అప్పట్లో చంద్రముఖి సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అప్పట్లో రిలీజ్ అయిన చంద్రముఖి సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. అయితే ఇదే సినిమాను ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 పేరుతో రిలీజ్ చేశారు. ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే అప్పుడు జ్యోతిక నటించిన పాత్రను కంగనా రనౌత్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం.
కథ మరియు వివరణ
Advertisement
రాఘవ లారెన్స్ హీరోగా చేసిన చంద్రముఖి 2 కథ విషయానికి వస్తే… చంద్రముఖి సినిమా కథ ఎక్కడ ముగిసిందో… ఈ చంద్రముఖి పార్ట్ 2 కూడా అక్కడే ప్రారంభమవుతుంది. అదే ఇంట్లో చంద్రముఖి పార్ట్ 2 మొత్తం చేశారు. ఈ సినిమాకు ఈ సీక్వెల్ కు వడివేలు పాత్రను ఆధారంగా తీసుకున్నారు. మొదటి పార్ట్ లో చంద్రముఖి ఆత్మవస్తే…. రెండవ పార్ట్ లో మాత్రం నేరుగా చంద్రముఖి కథనే చెప్పబోతున్నారు. చంద్రముఖి పగ పెంచుకున్న ఆ వెట్టై రాజా ( రాఘవ లారెన్స్ ) ఎవరు? చంద్రముఖి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? అసలు ఈ వెట్టై రాజా ఎవరు ? ఈ సారైనా చంద్రముఖి ఆత్మను పూర్తిగా వెళ్లగొట్టారా ? లేదా ? అనేది తెలియాలంటే సినిమా థియేటర్లలో చూడాల్సిందే.
Advertisement
ఈ సినిమా వివరణలోకి వస్తే… స్క్రీన్ ప్లే, పాత్రలు అన్ని చంద్రముఖిని ఫాలో అయిపోయారు. సినిమా ప్రారంభంలో రాఘవ లారెన్స్ యాక్షన్ ఎపిసోడ్ కాస్త భయపెట్టిన ఆ తర్వాత మాత్రం మళ్లీ అటువైపుగా వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ప్రతమార్గంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. వడివేలు కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఫస్టా ఆఫ్ లోనే రాఘవ లారెన్స్ దయ్యాల్లోని రకాల గురించి వడివేలుకు ఎక్స్ ప్లేన్ చేసే సీను దాదాపు 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉంటుంది. అలా చిన్న చిన్న సీన్లను బాగా సాగదీశాడు దర్శకుడు. ఓవరాల్ గా పార్టు 1 కంటే కాస్త లోగా ఉందని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్
రాఘవ లారెన్స్
వడివేలు
కంగనా రనౌత్
మైనస్ పాయింట్స్
వడివేలు కామెడీ
సాగదీత
రొటీన్ స్టోరీ
రేటింగ్ 2.5/5
ఇవి కూడా చదవండి
- Skanda Review : స్కంద సినిమా రివ్యూ.. హీరో రామ్ దుమ్ములేపాడా ?
- వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం..160 సీట్లు పక్కా – అశ్వినీదత్
- పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఎందుకు ఆలస్యం అయ్యాయి..ఇండియా కావాలనే చేసిందా ?