Home » ఆ స్టార్ ప్రొడ్యూసర్ కు చంద్రమోహన్ మేనమామ అవుతారని మీకు తెలుసా..!!

ఆ స్టార్ ప్రొడ్యూసర్ కు చంద్రమోహన్ మేనమామ అవుతారని మీకు తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తట్టుకొని నిలబడడం అంటే కత్తి మీద సాము లాంటిదే.. అలాంటి ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా పేరు పొందారు చంద్రమోహన్. ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో హీరోగా చేసిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది సినిమాల్లో నటించారు. అలాంటి చంద్రమోహన్ మేనల్లుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారట.. మరి ఆయనెవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. చంద్రమోహన్ మేనల్లుడు ఆ స్టార్ ప్రొడ్యూసర్ అన్న విషయం చాలామందికి తెలియదు.. కానీ ఆయన ఇండస్ట్రీలో పరిచయం ఉన్న వ్యక్తి.. ఇంతకీ ఎవరయ్యా అంటే.. శివలెంక కృష్ణ ప్రసాద్.

Advertisement

also read:తాతయ్య చేతిలో నవ్వుతున్న ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్..!!

Advertisement

ఈ ప్రొడ్యూసర్ చంద్రమోహన్ స్వయానా సోదరి కొడుకట. ఇతగాడు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసి ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్, తన మామ ద్వారా శ్రీదేవి మూవీస్ అని నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారట. దీని తర్వాత చంద్రమోహన్ మరియు రాజేంద్రప్రసాద్ వంటి చిన్నోడు పెద్దోడు అనే సినిమాను తీశారట. అక్కడి నుంచి మొదలైన శివలెంకకృష్ణ ప్రసాద్ సినీ ప్రయాణం మొన్న వచ్చిన యశోద మూవీ వరకు కొనసాగుతూ వచ్చింది.

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యశోద మూవీ ఆ నిర్మాణ సంస్థకు చాలా లాభాలను తెచ్చిపెట్టిందని. అంతేకాకుండా బాలకృష్ణ ఆదిత్య 369, దాని తర్వాత వంశానికొక్కడు, అనగనగా ఒక అమ్మాయి, ఊయల, మిత్రుడు, హీరో నానితో జెంటిల్ మాన్ వంటి సినిమాల నిర్మాణం బాధ్యతలు ఈయనవెనట. ఈయన నిర్మించిన చిత్రాలు రెండు తప్ప అన్ని సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలను అందించాయట. అంతేకాకుండా 2012లో ముత్యమంతా పసుపు అనే సీరియల్ కూడా నిర్మాణ బాధ్యతలు ఈయన వేనని తెలుస్తోంది.

also read:శాకుంతలం మూవీలో సమంతాను తీసుకోవడానికి కారణం ఆవిడే.!!

Visitors Are Also Reading