స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబునాయుడు ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన దాదాపు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశించింది కూడా. కొద్ది రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో మద్యంతర బెయిల్ లభించింది. బెయిల్ విచారణ నవంబర్ పదికి వాయిదా వేశారు. అయితే ఆరోగ్య పరిస్థితి చూసి మధ్యంతర బెయిల్ లభించిందని తెలుస్తోంది. కుడి కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలో ఆయన ఎడమ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు మూడు నెలల వ్యవధిలో కుడి కన్ను ఆపరేషన్ చేయాలి. ఈ విషయాన్ని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు చెప్పారు నివేదికలు పొందపరచడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ జారికి సుగమం అయ్యింది.
Advertisement
Advertisement
ఈ కేసులో అరెస్ట్ అయినా చంద్రబాబు దాదాపు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కేవలం అనారోగ్య పరిస్థితులు వలన మాత్రమే ఈ బేల్ ని వర్తింప చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పుని ఇవ్వడం జరిగింది. బెయిల్ విచారణ సందర్భంగా కొన్ని కండిషన్స్ ని చంద్రబాబుకి పెట్టారు. స్వేచ్ఛగా తన ఇంట్లో ఉండొచ్చని, చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లొచ్చని చెప్పారు. రాజకీయ సమావేశంలో కానీ నేతలతో భేటీలో కానీ పాల్గొన వద్దని చెప్పారు.
చంద్రబాబు వెంట ఇద్దరు డిఎస్పీలని ఉంచాలని కూడా ఆదేశించారు. అతనికి ఉన్న జెడ్ ప్లస్ భద్రత ని యధావిధిగా కొనసాగించవచ్చని చెప్పారు. అయితే ఇన్ని కండిషన్స్ మధ్య చంద్రబాబు బెయిల్ ఉండడంతో రాజకీయలకి సంబంధించి మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఇది కాస్త ఇబ్బందిని కలిగించే విషయం అని తెలుస్తుంది. మరోవైపు ఫోన్లో సైతం మాట్లాడకూడదని షరతులు పెట్టారు. నాలుగు వారాలు పాటు చంద్రబాబుకి బెయిల్ లభించింది. నవంబర్ 28న ఆయన తిరిగి జైల్లో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!