Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » బాల‌య్య షో లో బాబు చెప్పిన డైలాగ్‌లు వింటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

బాల‌య్య షో లో బాబు చెప్పిన డైలాగ్‌లు వింటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

by Anji
Ads

నంద‌మూరి బాల‌కృష్ణ ఏం చేసినా అది ఓ ప్ర‌త్యేకమ‌నే చెప్పాలి. ఓ వైపు రాజ‌కీయాల్లో రాణిస్తూనే.. మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తున్నాడు. బుల్లితెర‌పై బాల‌య్య ప‌వ‌ర్ ఏంటో అన్‌స్టాప‌బుల్ షో ద్వారా అంద‌రికీ తెలిసిపోయింది. దీంతో ప్ర‌ముఖ ఓటీటీ యాప్ ఆహాలో అన్ స్టాప‌బుల్ ప్రోగ్రామ్‌కి అద్భుత‌మైన‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ షోకి ఇంత రెస్పాన్స్ రావ‌డానికి బాల‌కృష్ణ‌నే కార‌ణ‌మంటున్నారు. అక్టోబ‌ర్ 14 నుంచి అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Also Rad : ర‌ష్మిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రాక‌పోవ‌డం వెనుక‌ ఇంత క‌థ ఉందా ?

Ad

తాజాగా మొద‌టి ఎపిసోడ్‌కి సంబందించిన ప్రోమో విడుద‌ల అయింది. ఇందులో బాల‌కృష్ణ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ కూడా స‌మాధానం చెప్పారు. ముఖ్యంగా చంద్ర‌బాబుని ఇంట్ర‌డ‌క్ష‌న్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంది. ‘ మొద‌టి ఎపిసోడ్‌కి నా బంధువుని పిలుద్దామ‌నుకున్నా.. కానీ అంద‌రి బంధువు అయితే బాగుంటుంద‌ని.. మీకు బాబు.. నాకు బావ చంద్ర‌బాబు నాయుడు ని ఆహ్వానించా. భార‌త‌దేశంలోని దిగ్గ‌జ రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రైన చంద్ర‌బాబుకి స్వాగ‌తం’ అంటూ బాల‌య్య ఆహ్వానం ప‌లికారు. ముఖ్యంగా త‌న‌కు రెండు ఫ్యామిలీలున్నాయ‌ని.. అందులో మొద‌టిది భార్య వ‌సుంధ‌ర‌, పిల్ల‌లు అని, రెండోది క్రితం వ‌ర‌కు స్టార్ట్ అయింద‌ని, దీంతో డీప్‌గా క‌నెక్ట్ అయిపోయాన‌ని అన్‌స్టాప‌బుల్ ని ఉద్దేశించి చెప్పారు. అందుకు బాబు స్పందిస్తూ ‘ఈ బ్రేకింగ్ న్యూస్ వింటేనే వ‌సుంధ‌ర‌కి చెప్పాలి అని అన్నారు.

Advertisement

Also Read : Sr. NTR:ఆమె కోరిక తీర్చడానికే NTR రాజకీయాల్లోకి వచ్చి.. అవమానాలు భరించారా..?

మీ జీవితంలో చేసిన మోస్ట్ రొమాంటిక్ ప‌ని ఏంటి అని బాల‌య్య ప్ర‌శ్నించ‌గా.. ‘నీ కంటే ఎక్కువే చేశాను. మీరు సినిమాల్లో చేస్తే.. నేను స్టూడెంట్‌గా చేశా’ అని బ‌దులిచ్చారు బాబు. బాల‌య్య స్పందించి మీరు ఎంతైనా ముందు చూపు క‌ల‌వారు. రాళ్లు, ర‌ప్ప‌లున్న హైద‌రాబాద్‌ని అద్భుతంగా మార్చారు. అప్పుడు బాహుబ‌లి రాలేదు కాబ‌ట్టి గ్రాఫిక్స్ అన‌లేర‌ని పేర్కొన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రు అని అడిగిన ప్ర‌శ్న‌కు ‘దివంగ‌త నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో క‌లిసి బాగా తిరిగాను’ అని చెప్పారు చంద్ర‌బాబు. మీరు తీసుకున్న నిర్ణ‌యం ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా.. 1995లో జ‌రిగిన విష‌యాల‌పై బాబు మాట్లాడారు. ఆ విష‌యంలో కాళ్లు ప‌ట్టుకునే వ‌ర‌కు వెళ్లాను. ఆ త‌రువాత మా చెల్లిని ఏమ‌ని పిలుస్తారు బావా అంటే పువ్వు అని స‌మాధానం ఇచ్చారు బాబు. ఆ త‌రువాత లోకేష్ ఎంట్రీ ఇచ్చి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ‘మీ నాన్న‌ను వేరే గెట‌ప్‌లో చూశావా’ అని మామ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఎప్పుడూ ఇదే గెట‌ప్‌లో ఉంటార‌ని చెప్పారు లోకేశ్‌. కొద్దిసేపు లోకేశ్ హోస్ట్‌గా చేసి మామ‌, తండ్రిపై ప్ర‌శ్న‌లు సంధించారు. ఇలా ప్రోమో ఆస‌క్తిగా సాగింది.

Also Read : మరో సారి సమంత లవ్ లో ఉన్నారా ? సమంత ఇచ్చిన ఈ హింట్ చూసారా ?

Visitors Are Also Reading