Home » ఆ ఒక్క పని చేసి ఉంటే… అక్కినేనిని మించే హీరో అయ్యేవారు…!

ఆ ఒక్క పని చేసి ఉంటే… అక్కినేనిని మించే హీరో అయ్యేవారు…!

by Bunty
Ad

 

తెలుగు సినీ ప్రేక్షకులకు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించి గొప్ప నటుడిగా ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. ఇక చంద్రమోహన్ హీరోగా నటించిన సమయంలో తన రేంజ్ ను చూసి హీరోలు సైతం భయపడేవారు. తాను కొంచెం హైట్ ఎక్కువ కనుక ఉంటే ఇప్పుడు స్టార్ హీరోగా ఉండేవాడు.

chandra-mohan

కానీ తనకు హైట్ లేదని ఎప్పుడూ బాధపడేవాడు కాదు. చంద్రమోహన్ ఫాలోయింగ్ ని చూసి ఈ పొట్టివాడు మహా గట్టివాడు అని అంతా అనుకునేవారట. హీరోగా దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కాస్త వయసు ఎక్కువ అవడంతో హీరోగా అవకాశాలు రాలేదు. దీంతో తాత, తండ్రి, అన్న వంటి పాత్రలలో నటించారు. చంద్రమోహన్ తాను చనిపోయే ముందు కూడా అతనికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయట.

Advertisement

Advertisement

కానీ వయసు పైబడడంతో షూటింగ్స్ కి సరిగ్గా వెళ్లలేక ఇబ్బంది పడ్డాడట. తన వల్ల వేరే వాళ్లకు ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో తనకు తానుగానే సినిమాలకు రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక చంద్రమోహన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో నవంబర్ 11వ తేదీ శనివారం రోజున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణాన్ని సినీ ఇండస్ట్రీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading