Home » ఓ నిర్మాత కారణంగా సూపర్ హిట్ సినిమాలు వదులుకున్న చాందిని చౌదరి..!

ఓ నిర్మాత కారణంగా సూపర్ హిట్ సినిమాలు వదులుకున్న చాందిని చౌదరి..!

by Azhar
Ad
సినిమా ప్రపంచంలో ఒక్కరు వదులుకున్న సినిమాలు మరొకరు చేయడం చాలా కామన్. ఇందుకు హీరోయిన్స్ కూడా ఏం మినహాయింపు కాదు. అయితే కొన్నిసార్లు డేట్స్ కుదరక కూడా కొన్ని సినిమాలను వదిలిపెట్టాల్సి వస్తుంది. కానీ అలా వదిలిన సినిమాలే సూపర్ హిట్ అయ్యి వారు చేసినా సినిమాలు ప్లాప్ అవుతాయి. అయితే ఇలానే మన టాలీవుడ్ హీరోయిన్ కూడా జరిగిందట. కానీ అది ఓ నిర్మాత చేసినా పనివల్ల తాను చాలా సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాను అని తెలిపింది.
అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు మన చాందిని చౌదరి. మొదట షాట్ ఫిలిమ్స్ లో నటించిన చాందిని చౌదరి ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన కొత్తలో చేసినా సినిమాలు మాత్రం అంతగా సక్సెస్ ఆమెకు ఇవ్వలేదు. కానీ ఈ కరోనా సమయంలో వచ్చిన కలర్ ఫోటో సినిమా చాందిని చౌదరికి సూపర్ హిట్ ను అందించింది. ఓటీటీలోనే విడుదలైన ఈ సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం చాందిని చౌదరి నటించిన సమ్మతమే సినిమా రాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి మాట్లాడుతూ తాను మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమాల గురించి చెప్పింది. అసలు ఊహలు గుసగుసలాడే, కుమారి 21ఎఫ్, పటాస్, దృశ్యం వంటి సినిమాలలో తానే నటించాల్సింది.. కానీ ఒక్క ప్రొడ్యూసర్ చేసినా పని కారణంగా ఆఇందులో చేయలేకపోయాను అని చెప్పింది. టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద ప్రొడ్యూసర్ రెండు సంవత్సరాల డేట్స్ తనవి తీసుకొని.. ఒక చిన్న సిన్ కూడా తీయలేదు అని చెప్పింది. అలాగే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని పేర్కొంది. ఆ సమయంలోనే ఈ సినిమాలు అన్ని వచ్చాయి.. కానీ ఆ నిర్మాతను ఎదురించలేక సైలెంట్ గా ఉండి.. ఈ సూపర్ హిట్స్ వదులుకున్నాను అని తెలిపింది చాందిని.

Advertisement

Visitors Are Also Reading