Telugu News » Chanakyaniti : ఇంట్లో జరిగే ఈ 5 సంకేతాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయిట…!

Chanakyaniti : ఇంట్లో జరిగే ఈ 5 సంకేతాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయిట…!

by AJAY MADDIBOINA
Published: Last Updated on

ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు కీడును శంకిస్తాయి. మనం పోనీలే అనుకుని వదిలేస్తాం కానీ అలాంటి సంఘటనలు మనల్ని ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టి వేస్తాయి. అలా ఇంట్లో జరిగే 5 సంఘటనలు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడానికి సంకేతం అని చాణక్యుడు తెలిపాడు. 5 సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Ads
chanakya nithi

chanakya nithi

పెద్దలను అవమానించడం

ఇంట్లో పెద్దలను అవమానించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వృద్ధులను అవమానిస్తే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని చాణక్యుడు వెల్లడించారు. కాబట్టి ఇంట్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగా వృద్ధులను గౌరవించాలని చెప్పాడు.

chanakya-nithi-telugu

chanakya-nithi-telugu

తరచూ గొడవలు జరగడం

కొందరు ఇంట్లో తరచూ గొడవ పడుతూ ఉంటారు. అయితే అలా గొడవ పడడం వల్ల కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇంట్లో గొడవలు జరగడం వాటి గురించి ఇరుగుపొరుగు వాళ్ళు చెప్పుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని దాంతో ఆర్థిక సమస్యలు తప్పవని తెలిపాడు.

గాజు పగలడం

ఇంట్లో ముఖం చూసుకునే అద్దం పదే పదే పగిలి పోతుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఇంట్లో పగిలిన గాజు ఉంటే వెంటనే బయట పారేయాలని చెప్పాడు

తులసి చెట్టు ఎండి పోవడం

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. అయితే చెట్టుకు పూజలు చేయడంతో పాటు దానిని పచ్చగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆర్థిక సమస్యలు తప్పవని చాణక్యుడు పేర్కొన్నాడు. తులసి చెట్టు ఎండి పోవడం ఆర్థిక సమస్యలు చుట్టేందుకు సంకేతమని చాణక్యుడు తెలిపాడు.

దేవుళ్లను పూజించకపోవడం

దేవుళ్లను పూజించకపోవడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చాణక్యుడు తెలిపాడు. ఎవరి ఇంట్లో అయితే పూజలు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా పూజలు చేసే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చాణక్యుడు పేర్కొన్నాడు.


You may also like