సాధారణంగా స్త్రీ ని శక్తితో పోల్చుతుంటారు. కుటుంబాన్ని నిర్మించే శక్తి ఎక్కువగా మహిళలకు ఉంటుంది. స్త్రీ కనుక మనస్సు పెడితే ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. స్త్రీలలో ఉండే కొన్ని లక్షణాలు ఉంటే వారి జీవితం బంగారు మయమవుతుంది. ఆమెలోని కొన్ని లక్షణాలు జీవితాన్ని నాశనం చేస్తాయని కూడా తెలిపాడు చాణక్యుడు. ఆచార్య చాణక్య ప్రకారం.. స్త్రీలకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
చాణక్య నీతి ప్రకారం.. స్త్రీలు పురుషుల కంటే అత్యాశ ఎక్కువ ఉంటుంది. అది డబ్బు, నగలు, బట్టలు తదితర విషయాల్లో అయి ఉంటుంది. మనిషికి కోరిక ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. అది ఎప్పటికైనా చాలా ప్రమాదం. అతిగా అత్యాశతో ఉంటే మోక్షానికి అవకాశం లేదని చాణక్యుడు చెప్పాడు. దీంతో అనేక సమస్యలు వస్తాయి. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
Advertisement
చాణక్యుడి ప్రకారం.. మహిళలు ఏదైనా పని చేసేటప్పుడు అస్సలు ఆలోచించరు. ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొంచెం తడబడినా ప్రమాదంలో పడతారు జాగ్రత్త. ఆలోచన లేకుండా చేసే పనులు విజయాన్ని ఇవ్వలేవు. కొందరూ స్త్రీలు స్వార్థపరులుంటారు. తమ పని పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడతారు. స్త్రీలు ఈ లక్షణాలను విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో కొన్ని విషయాలు మాత్రమే జరుగుతాయి. అందుకోసం కొన్ని కోల్పోవలసిన అవసరం లేదు. అలా చేస్తే మిమ్మల్ని చూసి ఇతరులు చెడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది.
స్త్రీలకు ధైర్యం మంచిదే. కానీ మితిమీరిన ధైర్యం అస్సలు మంచిది కాదు. మితిమీరిన ధైర్యసాహసాలు మిమ్మల్ని ఏదో ఒక రోజు కష్టాల్లో పడేస్తాయి అని చాణక్యుడు చెప్పాడు. ఏం కాదులే అని కొన్నిసార్లు ముందుకు వెళ్లితే సమస్యలు తప్పవు. ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. మితిమీరిన ధైర్యం పురుషులకు కూడా మంచిది కాదు. ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండటం చాలా ఉత్తమం.