ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చాణక్యుడు చెప్పిన విధానాలను పాటించినట్టయితే జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టాన్నీ సులభంగా అధిగమించి జీవితానికి సంబంధించిన అన్నీ సంతోషాలను పొందవచ్చు. చాణక్యుడి ప్రకారం.. పెళ్లి బంధం బలపడాలంటే ఏం చేయోలో సూచించాడు. పది కాలాల పాటు దంపతులు గొడవలు లేకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి. వారి జీవితంలో సుఖ, సంతోషాలు వెల్లివిరియాలంటే కొన్ని విషయాలను పట్టించుకోవాలి. భార్య, భర్తల్లో బంధం బలపడాలంటే ఇద్దరి అవగాహన ఉండాలి. అనురాగం పెరిగితేనే ప్రేమానుబంధాలు బలపడుతాయి. దీంతో మనకు జీవితంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉంటాయి.
Advertisement
ఇద్దరూ గౌరవించుకోవాలి
దంపతులు ఇద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి. వారి ఆలోచనలు పంచుకోవాలి. ఇద్దరి మధ్య భావాలు అర్థం చేసుకోవాలి. జీవిత భాగస్వామికి అన్ని పనుల్లో తోడు ఉండాలి. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగాలి. సఖ్యత ఇనుమడించాలి. అలా ఉంటే వారిద్దరి అభిప్రాయాలు సమన్వయంగా నడుచుకుంటే వారి మధ్య విభేదాలు రావు.
విశ్వాసం
Advertisement
భార్యభర్తల మధ్య విశ్వాసం ఉండాలి. ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి. అందుకే వీరిద్దరి మధ్య బంధం బలపడాలంటే నమ్మకమే ప్రధానం. భాగస్వామికి నమ్మకద్రోహం లేకుండా చూసుకోవాలి. నమ్మకం లేని సంబంధం బలహీనంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే దంపతుల మధ్య అనురాగం పెరగకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి.
క్షమాగుణం
వివాహ బంధంలో సహనం, క్షమాపణ సర్వసాధారణం. ఏ తప్పు జరిగినా సారీ చెబితే సర్దుకుపోవచ్చు. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తి చూపకుండా చాలా ఓపిక పట్టాలి. తప్పు జరిగితే క్షమించడమని అడగడంలో ఈగో చూపించకూడదు. మన వల్ల తప్పు జరిగితే.. క్షమించమని అడగడంలో తప్పులేదు. ఇలా చేయడం ఇద్దరి మధ్య సంబంధం పెరుగుతుంది. భార్య, భర్తల బంధం బలపడాలంటే.. కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. లేనట్టయితే.. సంసారంలో కలతలు వచ్చే అవకాశముంది. దంపతుల మధ్య సఖ్యత పెరగడానికి పలు రకాల చర్యలు తీసుకోవాలి. ఇలా సంసారంలో భార్య భర్తల మధ్య అనురాగం పెరగడానికి కారణం అవుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Chanakya Niti : ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వకండి..!
జనం కోసం జననేత భట్టి విక్రమార్క… గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చ..!!
కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన పత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?