Home » చిన్న విషయానికే మీ భార్య కన్నీరు కారుస్తోందా..అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..?

చిన్న విషయానికే మీ భార్య కన్నీరు కారుస్తోందా..అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా చాలామంది స్త్రీలు సున్నిత మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైన భావద్వేగానికి గురవుతూ ఉంటారు. అలాంటి స్త్రీలు భార్యగా దొరికితే చాలా మంచిదని చాణక్యుడు అంటున్నారు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..? చిన్న చిన్న విషయాలకే స్త్రీలు భావోద్వేగానికి గురైతే ఆ స్త్రీలు మంచివారని, వారికి గౌరవం ఇవ్వాలని ఆచార్య చాణక్యుడు తెలియజేశారు.

Advertisement

also read:టాలీవుడ్ లో మొదటిసారి 100రోజుల ఫంక్షన్ చేసుకున్న మూవీ..!

ఈ విధంగా ప్రతి విషయానికి కన్నీరు పెట్టుకునే మహిళలు కుటుంబంపై ఎంతో ప్రేమను కలిగి ఉంటారని, కుటుంబాన్ని విడిచి పెట్టడానికి ఇష్టపడారని, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఐక్యంగా ఉండాలని కోరుకుంటారట.. దీనికి ప్రధాన కారణం భావోద్వేగానికి గురయ్యే స్త్రీలలో కోపం, ఉద్రిక్తత మనసులో ఎప్పుడు ఉంచుకోరని, కోపం వచ్చినా, బాధ కలిగిన కన్నీళ్ళ ద్వారా బయట పెట్టేస్తారని అంటున్నారు.

Advertisement

ఈ విధంగా వారు ఏడుస్తూ ఎవరి వల్ల అయితే ఏడుస్తున్నారో ఆ తప్పులను అప్పటికప్పుడే ఎత్తి చూపి వారి మనసులో నుంచి ఆ బాధను తీసేస్తారని, మనసులో పగ పెంచుకోరని చాణక్యుడు అన్నారు. ఇలా తరచూ భావోద్వేగానికి గురయ్యే ఆడవారి మనసులో కుటుంబం పట్ల చాలా ప్రేమ ఉంటుందని, వీరి కుటుంబ గౌరవం కోసం ఏదైనా చేస్తారని ఆచార్య చాణిక్యుడు తెలియజేశారు. కాబట్టి ఇలాంటి స్త్రీలు భార్యగా దొరికితే మంచిదని ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో బోధించారు.

also read:

Visitors Are Also Reading