Home » చాణక్య నీతి : ఈ 5గురు వ్యక్తులతో శతృత్వం వద్దు…లేదంటే….!

చాణక్య నీతి : ఈ 5గురు వ్యక్తులతో శతృత్వం వద్దు…లేదంటే….!

by AJAY
Ad

ఆచార్య చాణ‌క్యుడు గొప్ప ఆర్థిక వేత్త ….సామాజికవేత్త. జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలి… ఎలాంటి విష‌యాల జోలికి పోకూడ‌దు అనే విషయాలను క్లుప్తంగా వివరించారు. చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా ఎన్నో గొప్ప విషయాలను ప్రజలకు సూచించారు. అవి పాటించిన వారి జీవితాల్లో మంచి జరుగుతుంది కూడా. ఇక చాణ‌క్యుడు కొంతమందితో శత్రుత్వం మంచిది కాదని హెచ్చరించాడు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం…

chanakya nithi

chanakya nithi

చేతిలో ఆయుదం ఉన్న వ్యక్తితో శత్రుత్వం పెట్టుకోవద్దని చాణ‌క్యుడు హెచ్చరించాడు. అలాంటి వ్యక్తితో స్నేహం శత్రుత్వం రెండూ కూడా జీవితానికి ప్రమాదకరం అని హెచ్చరించాడు.

Advertisement

Advertisement


వంటవాడితో, వైద్యునితో కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు అని చెప్పాడు. వైద్యుడితో శత్రుత్వం నష్టాన్ని కలిగిస్తుందని అది భర్తీ చేయడం కష్టమని పేర్కొన్నాడు. వంట వాడితో శత్రుత్వం జీవితానికి ప్రమాదం అని చెప్పాడు.


ధనవంతుడు, శక్తివంతమైన వారి నుండి దూరంగా ఉండటం తెలివైన వారి పని అని చెప్పాడు. అలాంటి వారి దగ్గరకు వెళితే మన కష్టాన్ని దోచుకోవడమే కాకుండా ఆ తర్వాత డ‌బ్బు కోసం మ‌న‌కు న‌ష్టం చేసేందుకు కూడా వెనకాడరు అని చెప్పాడు.

also read : ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. ఏటీఎం కార్డు లేకుండానే మ‌నీ విత్ డ్రా..!

మూర్ఖులకు దూరంగా ఉండాలని చాణక్యుడు తెలిపాడు. మూర్ఖులకు ఎదుటివారిపై నమ్మకం ఉండ‌దని కాబట్టి అలాంటివారికి దూరంగా ఉండాలని చెప్పాడు.

Visitors Are Also Reading