Home » ఓ స్టార్ హీరో రేంజ్ లో చమ్మక్ చంద్ర ఆస్తులు..ఎంతో తెలుసా..?

ఓ స్టార్ హీరో రేంజ్ లో చమ్మక్ చంద్ర ఆస్తులు..ఎంతో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీ అనేది అందరికీ కలిసి రాదు. కొంతమంది ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతారు. మరి కొంతమంది రావడం రావడమే చాలా స్పీడ్ గా దూసుకెళ్తారు. ఇంకొంతమంది కొన్నేళ్లు కష్టపడి స్టార్ డం తెచ్చుకొని దూసుకుపోతుంటారు.. అలాగే ఈ కమెడియన్ కూడా ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను సంపాదించుకున్నాడు. ఇంతకీ ఆ కమెడియన్, నటుడు ఎవరో కాదూ.. మనందరినీ జబర్దస్త్ ద్వారా కడుపుబ్బా నవ్వించిన చమ్మక్ చంద్ర. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నారు.

Advertisement

also read:పెళ్లికి సిద్ధమైన పవిత్ర నరేష్.. లిప్ కి**తో కన్ఫామ్.. వీడియో వైరల్ ..!!

ప్రస్తుతం ఆ షోని వదిలి అదిరింది షో కి వెళ్ళాడు చమ్మక్ చంద్ర. మరి చమ్మక్ చంద్ర జీవితం, ఈ రేంజ్ కి రావడానికి పడ్డ కష్టం ఏంటో ఇప్పుడు చూద్దాం .. ఒకానొక ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్ర మాట్లాడుతూ .. 13 ఏళ్ల వరకు తినడానికి కూడా ఇబ్బంది పడిన రోజులు అనేకం ఉన్నాయని, నెల వస్తే రూమ్ రెంటు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండే వాడినని అన్నారు. అంతటి కష్టాలను దిగమింగుకొని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్నది సాధించే దిశగా ముందుకు వెళుతున్నాడు చమ్మక్ చంద్ర. అలా 13 ఏళ్ల కష్టం తర్వాత జబర్దస్త్ షో లైఫ్ ఇచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత క్రమక్రమంగా పుంజుకొని పైసా పైసా కూడ బెట్టి హైదరాబాదులో కోటి విలువ చేసే ఇల్లును కట్టుకున్నాడు.

Advertisement

పక్కా ప్లానింగ్ తో బుల్లితెరపై అనేక షోలు చేస్తూ, మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ కామెడీ షో లో అందరికంటే ఎక్కువ ఆస్తులు చమ్మక్ చంద్రకే ఉన్నాయని అప్పట్లో నాగబాబు ఓ సారి అన్నారు. అంతేకాకుండా ఆయనకు బీఎండబ్ల్యూ కారు , హైదరాబాదులో పలుచోట్ల ఆస్తులు, తన సొంత ఊరైన నిజాంబాద్ లో కూడా ఆస్తులు కొన్నాడని వాటి విలువ కూడా బాగానే ఉంటుందని తెలుస్తోంది. చమ్మక్ చంద్ర అదిరింది షోలో ఒక్క స్కిట్ కు నాలుగు లక్షల తీసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. ఈ విధంగా జీవితంలో ఎన్నో కష్టాలు పడి అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన కెరీయర్లో ముందుకు సాగుతున్నాడు చమ్మక్ చంద్ర.

also read:

Visitors Are Also Reading