Home » చమ్మక్ చంద్ర మామూలోడు కాదు.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

చమ్మక్ చంద్ర మామూలోడు కాదు.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ఎంతోమంది టాలెంట్ ఉన్నటువంటి కామెడియన్స్ కు ప్లాట్ ఫామ్ అయి వారికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ షో ద్వారా ఎంతో గుర్తింపును సాధించుకొని బుల్లితెర నుండి వెండితెరకు ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్స్ ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన స్టేజ్ పై ఎక్కారంటే నవ్వులు విరాజమ్మాల్సిందే. అంతటి కామెడీ టాలెంట్ ఉన్న కమెడియన్.

Advertisement

Also Read:మెగా ఇంట్లో బిడ్డ పుడితే ఉపాసనకు పరిస్థితి దారుణమేనట..!!

అయితే చంద్ర తన కెరియర్ మొదట్లో అనేక ఇబ్బందులు పడ్డారట. ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో అవకాశాలు లేక కనీసం ఒక పూట తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడుతూ జబర్దస్త్ తనకు లైఫ్ ఇచ్చిందని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతోపాటుగా చాలా ఆస్తులు కూడా సంపాదించారట. చమ్మక్ చంద్ర కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈయనకు మణికొండలో సొంత ఇల్లు, అలాగే లగ్జరీ కారు కూడా ఉందట.

Advertisement

Also Read:పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

అంతేకాకుండా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ల్యాండ్స్, వీటి విలువ కోట్ల రూపాయల లోనే ఉంటుందని తెలుస్తోంది. ఒక సినిమా హీరోకి ఎన్ని ఆస్తులు ఉంటాయో ఆ విధంగా చంద్ర ఆస్తులు కూడా ఉన్నట్టు సమాచారం. మల్లెమాల లో ఉన్నప్పుడే జబర్దస్త్ లోని అందరూ కమెడియన్స్ కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే వారట. ఒక్కో ఎపిసోడ్ కు నాలుగు లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకునే వారట. ఈ విధంగా చంద్ర బాగానే సంపాదించారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పారు.

Also Read:నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ అవ్వలేకపోయారు…? 5 కారణాలు ఇవేనా..!

Visitors Are Also Reading