Home » తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త..!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త..!

by Anji
Ad

సాధారణంగా సంక్రాంతి పండుగ సీజన్ చలిగా ఉండే విషయం తెలిసిందే. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు సంక లేవకుండా చలి ఉంటుందని మన పెద్దలు పలు సందర్భాల్లో చెబుతుంటారు. శీతాకాలంలో చలి, వేసవి కాలంలో ఎండా, వర్షాకాలంలో వాన వస్తుంటాయి. ప్రతీ సీజన్ లో కొన్ని సందర్భాల్లో ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో అంతగా ఉండవు. కానీ ఈ సీజన్ లో మాత్రం చలితో తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రభావం వల్ల రోడ్లు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 

Advertisement

ఉదయం వేళలో ఒకవైపు పొగమంచు, మరోవైపు గడ్డకట్టుకుపోయే చలిలో ప్రజలు తీవ్రఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ఇక ఈశాన్య గాలులతో చలి తీవ్ర పెరిగిందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మధ్యప్రదేశ్, విదర్భ నుంచి వీస్తున్న చలిగాలులతో రాబోయే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. వచ్చే 3 రోజులు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్.. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. హైదరాబాద్ లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం.  

Advertisement

Also Read :   వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్.. ఇక నుంచి  గూగుల్ డ్రైవ్ అవసరం లేదు..!

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి చంపేస్తుందనే చెప్పాలి. అక్కడ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏజెన్సీలోని మినుమూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలు నమోదు అయ్యాయి. అరకులోయలో 10 డిగ్రీలు నమోదు అయ్యాయి. టెంపరేచర్ తగ్గే కొద్ది పొగమంచు గడ్డ కడుతోంది. మంచు వాహనాలపై గాజులా పేరుకుపోతుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఏజెన్సీ ప్రాంతాలలో మంచు గడ్డకట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చింతపల్లి, హుకుంపేట, జి.మాడ్గుల, జీకే వీధిలో 1.5 డిగ్రీలు, గంపరాయి 2.6, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. చల్లని గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ వేవ్ కొనసాగుతుందని దీని ప్రభావం మూడు రోజుల వరకు ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. 

 Also Read :  డయాబెటిక్ పేషెంట్స్ అధిక బరువు పెరగడానికి కారణాలు ఇవే..!

Visitors Are Also Reading