టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 1200కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా వందలాది సినిమాల్లో కనిపించారు. గత కొంత కాలంగా ఆయన వయోభారం రిత్యా ఇంటికే పరిమితమయ్యారు. పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. చలపతి రావు జీవితంలో పలు విషాద సంఘటనలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా నవ్వుతూనే కనిపించే వారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
Advertisement
అసలు విషయం ఏంటంటే.. చలపతి రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబానికి కూడా తెలియకుండా ఓ అమ్మాయి తనను ఇష్టపడిందనే కారణంతో ఆయన ప్రేమ పెళ్లి చేసుకుని..ఆ తరువాత కుటుంబాన్ని ఒప్పించుకున్నారు. అనారోగ్యంతో చలపతిరావు భార్య పెళ్లి అయిన కొద్ది సంవత్సరాలకే మరణించారు. ఆమె మరణించే సమయానికి రవిబాబు వయస్సు ఏడు ఏళ్లు. ఆ తరువాత చలపతిరావు మళ్లీ పెళ్లి చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన మాత్రం మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు. తన సంతానమే తన ఆస్తిగా భావించి వారిని ప్రయోజకులుగా తీర్చిద్దే ప్రయత్నంలోనే ఉన్నారని సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా తన తండ్రి చలపతి రావుకి పెళ్లి చేయాలని కుమారుడు రవిబాబు కూడా చాలా ప్రయత్నాలు చేశారట. కానీ చలపతి అందుకు ఒప్పుకోలేదు.
Advertisement
మానాన్నకు పెళ్లి అనే సినిమా మాదిరిగానే రవిబాబు పలు సంబంధాలను చలపతిరావు కోసం తీసుకొచ్చినా అన్నింటిని ఆయన దూరం పెట్టేవారని చెబుతుంటారు. ఎప్పుడూ పైకి సరదాగా కనిపిస్తూ లేదా గంభీరంగా కనిపిస్తూ ఉండే చలపతిరావు జీవితంలో పలు విషాద ఘటనలున్నాయి. సిల్లీఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8 నెలల వరకు చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు చలపతిరావు. ఇక ఆ సమయంలోనే కంటి చూపు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటికి పరిమితమవ్వకూడదనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను ఆయనను వినయవిధేయరామ సినిమా కోసం ఆయనని ఓ పాత్ర కోసం రోప్ చేశారు. చక్రాల కుర్చీలో ఉండగానే ఇక్కడి నుంచి బ్యాంకాక్ తీసుకెళ్లి మరి షూటింగ్ చేయించినట్టు అప్పట్లో పలు ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు చలపతిరావు. ఒకానొక సందర్భంలో చలపతిరావు Suసైడ్ కూడా చేసుకొని చనిపోవాలని భావించారట. ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్ లో మహిళలనుద్దేశించి చలపతిరావు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారానికి కారణమయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన మీద తీవ్రంగా నెగిటివిటి వచ్చింది. అలాంటివాడు బతికి ఉండడం ఎందుకు అంటూ కూడా నెగిటివ్ ట్రోల్స్ చేయడంతో చనిపోవాలని అనుకున్నారట చలపతిరావు. ఆ తరువాత తన కుమారుడు రవిబాబు మోటివేషన్ తో ఆయన డిప్రెషన్ నుంచి బయటికి వచ్చారని సమాచారం.
Advertisement
Also Read : సంక్రాంతి పండుగకి వచ్చే సినిమాల్లో విన్నర్ గా నిలిచేది ఆ సినిమానేనా..?