Telugu News » ఆ సీన్లు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా…టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్…!

ఆ సీన్లు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా…టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్…!

by AJAY
Ad

తమిళ ఇండస్ట్రీ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ మాళవిక. 42ఏళ్ల ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ కి రెడీ అవుతోంది. అయితే తాజాగా మాళవిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు వేసింది. మాళవిక శ్రీకాంత్ హీరోగా నటించిన “చాలా బాగుంది” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

malavika

malavika

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. “చాలా బాగుంది” సినిమా షూటింగ్ సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు తాను కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అని చెప్పింది. తనకు అంత కంఫర్ట్ గా లేదని చెప్పానని తెలిపింది. అలా చెప్పడంతో శ్రీకాంత్ వెంటనే షూటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయారని తెలిపింది. అంతే కాకుండా ఈ సినిమాలో అత్యాచారం సన్నివేశం చేసినందుకు ఇప్పటికీ డిస్ట్రబ్ అవుతానని చెప్పింది.

Advertisement

Advertisement

బాలీవుడ్ లో కూడా సీయు ఎట్ 9 అనే సినిమాలో ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసినందుకు తన పేరెంట్స్ కోప్పడ్డారని చెప్పింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో తెరకెక్కిన పుష్ప సినిమాను తాను చూశానని చెప్పింది. అంతే కాకుండా సినిమాలో సమంత సాంగ్ బాగా నచ్చింది అని అలా స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం వేస్తే తాను చేయడానికి రెడీ అంటూ మాలవిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Visitors Are Also Reading