Home » చైతన్య మాస్టర్ చివరి ఫోన్ కాల్ మాటలు విన్నారా ? కన్నీళ్లు పెట్టిస్తున్నాయి..!

చైతన్య మాస్టర్ చివరి ఫోన్ కాల్ మాటలు విన్నారా ? కన్నీళ్లు పెట్టిస్తున్నాయి..!

by Anji
Ad

ఢీ డ్యాన్స్ షోతో ఫేమస్ అయినటువంటి కొరియోగ్రాఫర్ చైతన్య తిరిగిరాని లోకాలను వెళ్లడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి.. ఎంతో మంచివాడు.. అకస్మాత్తుగా ఇలా చేసుకోవడం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రధానంగా తోటి కళాకారులు, ప్రముఖ కొరియో గ్రాఫర్లు, తెలుగు అభిమానుు విచారం వ్యక్తం చేశారు. అప్పుల బాధతోనే తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో వివరించారు చైతన్య. ఒకసారి చైతన్య నోరు తెరిచి అందరితో మాట్లాడితే పరిస్థితి మరోలా ఉండేది అంటూ వాపోతున్నారు. ప్రస్తుతం చైతన్యకి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Also Read :  వైర‌ల్ అవుతున్న బాల‌య్య వ‌సుంధ‌రల శుభ‌లేఖ‌…స్పెషాలిటీ ఏంటంటే..!

Advertisement

చైతన్య ఎంతో గొప్పకొరియోగ్రాఫర్. చాలా సందర్భాల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఉన్నట్టువంటి అకస్మాత్తుగా ఆత్మ** చేసుకోవడంతో అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాట్లాడినటువంటి ఓ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైజాగ్ లో ఒక స్టేజ్ షో కోసం డ్యాన్సర్స్ ని ఏర్పాటు చేయాలని ఒకరూ చైతన్యకి కాల్ చేశారు. అతనితో చైతన్యకు ముందు నుంచే పరిచయముంది. డ్యాన్సర్ ఐశ్వర్యను షో కోసం మాట్లాడాలని కోరారు. ఐశ్వర్యకు వేరే షూట్ ఉందని.. ఇంకొక డ్యాన్సర్ ని మాట్లాడతాను అని చెప్పుకొచ్చాడు చైతన్య. స్టేజ్ షో కి సంబంధించి అలా వారి మధ్య సంభాషణ జరిగింది. 

Advertisement

Also Read :  అఖిల్ నాగార్జున మాట ఎందుకు విన‌డు..? ఆ త‌ప్పే కొంప ముంచుతుందా..?

ఇది చైతన్య చివరి ఫోన్ కాల్ అని అంటున్నారు. కానీ ఇది జనవరి నెలలో జరిగిన సంభాషణలా కనిపిస్తోంది. ఈ ఫోన్ కాల్ లోనే చైతన్యకి సదరు వ్యక్తి ఓ సాంగ్ ఆఫర్ కూడా ఇచ్చాడు. దాదాపు 10 మంది కుర్రాళ్లతో ఓ సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటూ కోరుతాడు. చైతన్య తన లైఫ్ లో నిలదొక్కుకోవడం కోసం ఇటు ఢీ తో పాటు బయటి షోలను కూడా చేసేవాడట. అదేవిధంగా అతనికి ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఎందుకు ఇలా అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంది.చైతన్య మాస్టర్ ఎప్పుడూ డ్యాన్స్ గురించే ఆలోచిస్తాడని, ఎప్పుడూ కెరీర్ గురించే మాట్లాడుతాడంటూ.. ఈ ఫోన్ కాల్ విన్నటువంటి అభిమనులు, తోటి కొరియోగ్రాఫర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  ఎంతటి సమస్య అయినా సరే బతికి ఉన్న సమయంలోనే పోరాడేందుకు ప్రయత్నించాలి. మీ సమస్యను పరిష్కారమయ్యే విధంగా మార్గాలు వెతుక్కుంటే పరిష్కారం తప్పకుండా పరిష్కారమవుతాయి.

 Also Read :  పవన్ కళ్యాణ్ కి మళ్లీ కుదిరిన హిట్ కాంబినేషన్.. ఈసారి ఎలాగో..!

Visitors Are Also Reading