Home » తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?

by Sravanthi
Ad

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలవుతుంది. మొన్నటి మునుగోడు ఎన్నికల నుండే అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క స్పీడ్ పెంచాయి. ఎవరికి వారే పార్టీ కార్యకర్తలతో ప్రజలతో మమేకమవుతూ రాబోవు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

also read:అనసూయను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా.. ఆలస్యమెందుకు చూసేయండి..!!

తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నామని, ఎన్నికల విషయంలో మాకు ఎలాంటి తొందరపాటు లేదని కిషన్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వమైనా పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగానే నడుస్తుందని, సానుభూతి హీరోయిజం చూపించుకోవడం మాకు తెలియదు అంటూ చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం రోజుకో తప్పు చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపణ చేశారు. తెలంగాణ ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉందని ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మాదే అంటూ గట్టిగా మాట్లాడారు.

Advertisement

కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలోకి రావడం ఎంతో ఆనందదాయకమని మా పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. అహంకార కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఆకాంక్షించారు. తెరాస సర్కార్ అధికార దుర్వినియోగం చేస్తూ కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణకు దిక్కు అనే విధంగా పాలన చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకోసమే బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కల్వకుంట్ల కుటుంబం బురదజల్లే ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహాన్ని వెల్లగక్కారు. తెరాస పార్టీ దుందుడుకు విధానానికి రాబోవు రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

also read:

Visitors Are Also Reading