Home » హైద‌రాబాద్ మెట్రోకు చెల్లించాల్సిన డ‌బ్బును నిలిపివేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. అందుకోస‌మేనా..?

హైద‌రాబాద్ మెట్రోకు చెల్లించాల్సిన డ‌బ్బును నిలిపివేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. అందుకోస‌మేనా..?

by Anji
Ad

కేంద్ర ప్ర‌భుత్వం మెట్రో కు కొంత భాగం చెల్లించే విష‌యం విధిత‌మే. అయితే హైద‌రాబాద్ మెట్రోకు చెల్లించాల్సిన డ‌బ్బును కేంద్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది.  మొత్తం మంజూరైన‌ రూ.1,458 కోట్ల రూపాయ‌ల‌లో హైద‌రాబాద్ మెట్రోకు ఇప్ప‌టివ‌ర‌కు రూ.1,204 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేసి రూ.254 కోట్లు నిలిపివేసింది. ఇక మెట్రో రైలు వ‌యాబిలిటీ గ్యాస్ ఫండింగ్ మార్గ‌ద‌ర్శ‌కాలను ఉల్లంఘిచినందుకే ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంటుంది. ప్రాజెక్ట్ వాస్త‌వ వ్య‌యం 18,411 కోట్ల రూపాయ‌లు అందులో రూ.1204 కోట్లు భార‌త ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.


ఎల్ అండ్ టీ మెట్రో రైలు లిమిటెడ్ 17,207 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేసింది. కేంద్రం ఇవ్వాల్సిన 254 కోట్ల రూపాయ‌లు నిలిపివేసింది. హైద‌రాబాద్ మెట్రోను ప‌బ్లిక్ ప్ర‌యివేట్ పార్ట్‌న‌ర్‌షిప్ మోడ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం వ‌యాబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప‌థ‌కం ద్వారా పీపీపీ మోడ‌ల్ ఫండింగ్ కింద తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేప‌ట్టింది. ఆర్థికంగా లాభ‌దాయ‌కంగా లాభ‌దాయ‌కంగా లేని ప్రాజెక్ట్ల‌కు వీజీఎఫ్ కింద గ్రాంట్ అందించ‌బ‌డుతుంది. 2020-21లో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా హైద‌రాబాద్ లో మెట్రో ఆదాయం క్షీణించింది. 2020-21 హైద‌రాబాద్ మెట్రో 1,767 కోట్ల రూపాయ‌ల న‌ష్టాన్ని చ‌విచూసింద‌ని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Advertisement

సాధార‌ణంగా ప్ర‌భుత్వ ప్రాజెక్ట్ ల‌కు 2శాతం వ‌డ్డీరేటు మాత్ర‌మే ఉంటుంది. 13,252 కోట్ల రూపాయ‌ల భారీ అప్పు 9.1 శాతం అధిక వ‌డ్డీ భారం న‌ష్టాలు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు. దీనికి వెసులుబాటు లేక‌పోవ‌డంతో దాదాపు 1200 కోట్ల వ‌డ్డీ భారం ప‌డుతుంద‌ని మెట్రో రైలు అధికారులు వాదిస్తున్నారు. త‌మ భారీ న‌ష్టాల‌ను దృష్టిలో ఉంచుకుని నిలిపివేసిన 254 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని మెట్రో, ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. హైద‌రాబాద్ మెట్రో వ‌ల్ల క‌లిగే భారీ న‌ష్టాన్ని ప‌రిశీలించి వీలైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని మెట్రో త‌న లేఖ‌లో వెల్ల‌డించింది. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం లేక‌పోతే మెట్రో రైలు న‌డ‌వ‌డం క‌ష్టం అవుతుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read : 

ధ‌నూష్ విడాకుల‌కు ఆ స్టార్ హీరోయిన్ కార‌ణ‌మా..? ఆమె అందుకే క్లోజ్‌గా ఉంటుందా..?

అమ్మాయిలు ఎవరితో చెప్పుకోలేని రహస్య విషయాలు ఇవేనా..?

Visitors Are Also Reading