Home » కేంద్ర ప్ర‌భుత్వం 35 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం..!

కేంద్ర ప్ర‌భుత్వం 35 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం..!

by Anji
Ad

కేంద్ర ప్ర‌భుత్వం ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్‌లో ఫేక్ న్యూస్‌ను వైర‌ల్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెళ్ల‌కు సంబంధించి 2 ట్విట్ట‌ర్ అకౌంట్లు, 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్‌సైట్‌ల‌ను మోడీ ప్ర‌భుత్వం నిషేదం విధించింది . దేశంలో సున్నిత‌మైన అంశాల‌పై త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌సారం చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌ల‌తోనే యూట్యూబ్ చానెళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంది.

Best Ideas for YouTube Videos with your Best Friends – Film Daily

Advertisement

కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, జ‌న‌వ‌రి 20న కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌కు ఇంటెలిజెన్స్ ఆధారంగా పాకిస్తాన్ నుండి నిర్వ‌హిస్తున్న ఈ చానెళ్ల నుండి త‌ప్పుడు స‌మాచారం ప్ర‌సారమ‌వుతుంద‌ని గుర్తించారు. పాకిస్తాన్ వేదిక‌గా ఈ చానళ్లు ప‌ని చేస్తున్నాయ‌ని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఏజెన్సీ స‌మాచారంతో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయా చాన‌ళ్ల‌ను వెబ్ సైట్ల‌పై నిషేదించాల‌ని కేంద్రం ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంత‌కు ముందు జ‌న‌వ‌రి 19న స‌మాచార మ‌రియు ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు.

Advertisement

దేశానికి వ్య‌తిరేకంగా ప‌ని చేసే కుట్ర దారుల‌పై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు ఇటువంటి చ‌ర్య‌ల‌ను గుర్తిస్తున్నాయని.. అందులో భార‌త్ కూడా ఈ విష‌యంలో ముందుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను ప్ర‌సారం చేస్తున్న దృష్ట్యా భార‌త ప్ర‌భుత్వం గుర్తించ‌డంతో..వారిని యూట్యూబ్ కూడా బ్లాక్ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు వెల్ల‌డించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో స‌మాచార మ‌రియు ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల స‌మ‌న్వ‌యంతో భార‌త‌దేశానికి వ్య‌తిరేకంగా ఫేక్ వార్త‌ల‌ను వ్యాప్తి చేసిన 20 యూట్యూబ్ చానెళ్లు, రెండు వెబ్ సైట్ల‌ను కూడా బ్లాక్ చేసింది.

Visitors Are Also Reading