Home » ఓటీటీపై కేంద్రం కీలక నిర్ణయం..!

ఓటీటీపై కేంద్రం కీలక నిర్ణయం..!

by Anji
Ad

ఓటీటీ (Over The Top) పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇకపై ఓటీటీలో కూడా పొగారు వ్యతిరేక హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. 

Advertisement

2004లో ఉన్న చట్టం యొక్క నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓటీటీలో ఇకపై వచ్చే వెబ్ సిరీస్, సినిమాలు, వేరే కార్యక్రమాలలో పొగాకు హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేసింది. సినిమా థియేటర్లు, టీవీల్లో ప్రదర్శించినట్టు పొగాకు వినియోగం క్యాన్సర్ కి కారకం.. ప్రాణాంతకం అని ప్రోగ్రామ్ స్టార్టింగ్ ముందు..మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు ప్రకటన రావాలని సూచించింది. 

Advertisement

ఈ ప్రకటనతో పాటు వచ్చే ప్రోగ్రామ్ లో పొగాకు ఉత్పత్తులు కనిపించినప్పుడు డిస్ క్లెయిమర్ ను చూపించాలని తెలిపింది. ఈ మెసెజ్ కూడా నిబంధనలకు అనుగుణంగా తెలుగు బ్యాక్ గ్రౌండ్, నలుపు రంగులో ఉండాలని సూచించింది. అంతేకాదు.. ఓటీటీలో వచ్చే కంటెంట్ ప్రసారం అయ్యే లాంగ్వేజ్ లోనే ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఓటీటీలో వచ్చే ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా పొగాకు ఉత్పత్తులను చూపిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

భర్తను భార్య ఇలా చూసుకుంటే… మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు !

Chanakya Niti : భార్యలో ఈ లక్షణాలున్నట్టయితే.. ఆ భర్త సన్యాసం బెటర్ అనుకుంటాడట..!

 ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

Visitors Are Also Reading